MP Komatireddy Venkat Reddy: తెలంగాణలో హంగ్ ఖాయం.. కేసీఆర్ కాంగ్రెస్‌ను పొగడటం పొలిటికల్ డ్రామా

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదు. హంగ్ ఖాయమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ ఒంటిరిగా అధికారంలోకి రాదన్న ఆయన.. మాకు వేరేమార్గం లేదు, మరొకరితో కలవాల్సిందేనన్నారు. అయితే, ఆ ఆలోచన ఎన్నికల తరువాత చేస్తామని, ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని వెంకటరెడ్డి అన్నారు.

MP Komatireddy Venkat Reddy: తెలంగాణలో హంగ్ ఖాయం.. కేసీఆర్ కాంగ్రెస్‌ను పొగడటం పొలిటికల్ డ్రామా

MP Komatireddy Venkat Reddy

MP Komatireddy Venkat Reddy: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, హంగ్ ఏర్పడటం ఖాయమని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ‌లో హాంగ్ అసెంబ్లీ వస్తుందని, ఏ పార్టీకి 60 స్థానాలు మించి రావని వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ‌లో కాంగ్రెస్ ఒంటిరిగా అధికారం‌లోకి రాలేదని, మాకు మరో ప్రత్యామ్నాయం లేదని, మరొకరితో కలవాల్సిందేనని తేల్చిచెప్పారు. సీనియర్లు అందరం ఆరు నెలలు కష్టపడితే కాంగ్రెస్ పార్టీకి 40-50 స్థానాలు వస్తాయని అన్నారు. మార్చి 1 నుంచి అందరం కలిసి పార్టీకోసం పనిచేస్తామన్నారు.

MP Komatireddy Venkat Reddy : ప్రాణం పోయినా కాంగ్రెస్ లోనే ఉంటా : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జిగా మానిక్ ఠాక్రే వచ్చిన తరువాత పార్టీలో పరిస్థితులు బాగున్నాయన్న వెంకటరెడ్డి, రాష్ట్రంలో పాదయాత్ర, బైక్ యాత్ర చేస్తానని తెలిపారు. అయితే, అందరూ ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుని పాదయాత్రలు చేయాలని అన్నారు. ఆ పాదయాత్రల సందర్భంగా తెలంగాణ సాధించుకున్నది ఎందుకు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ బలంగా ఉందని, దానిని కాంగ్రెస్ నేతలంతా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Revanth Reddy : రాష్ట్రంలో సమస్యలన్నీ తీరాలంటే.. కేసీఆర్ పోవాలి కాంగ్రెస్ రావాలి-రేవంత్ రెడ్డి

ఎన్నికల సమయంలో సీట్ల కేటాయింపు తమ వారికే ఇవ్వాలనుకుంటే పార్టీ మునగడం ఖాయమని, గెలిచే వారికి సీట్లు ఇవ్వాలని వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో బలమైన పార్టీగా కాంగ్రెస్ ఉందని, కాంగ్రెస్ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్తుందని చెప్పారు. అయితే, ఫలితాల తరువాత మరొకరితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందేనని, జరిగేదే నేను చెబుతున్ననంటూ వెంకటరెడ్డి వచ్చే ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని పొగిడిన విషయం విధితమే. దీనిపై వెంకటరెడ్డి స్పందిస్తూ.. మాతో కలవాల్సిందే కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. అసెంబ్లీ‌లో కాంగ్రెస్‌ను పొగడటం కేసీఆర్ పొలిటికల్ డ్రామా అంటూ వ్యాఖ్యానించారు.