కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భట్టి విక్రమార్క

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికోసం కలిసి పనిచేస్తామని చెప్పారు.

Telangana Deputy CM Bhatti Vikramarka

Bhatti Visits Tirumala : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏపీలోని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఆదివారం తెల్లవారు జామున కుటుంబ సభ్యులతో కలిసి భట్టి విక్రమార్ స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు భట్టి, ఆయన కుటుంబ సభ్యులకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Read Also : Seetharama project : సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికోసం కలిసి పనిచేస్తామని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేసేందుకు మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఆమేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భట్టి పేర్కొన్నారు.

Read Also : ఎవరెన్ని ఎత్తులేసినా విశాఖ ఎమ్మెల్సీ కూటమిదే.. జనసేన పార్టీ నూతన కార్యాలయం ప్రారంభంలో..

 

ట్రెండింగ్ వార్తలు