Seetharama project : సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు

సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభం అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు.

Seetharama project : సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు

Khammam Sitarama Lift Irrigation Project

Updated On : August 11, 2024 / 1:39 PM IST

Seetharama project pump house : సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ల ట్రయల్ రన్ ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు ప్రారంభించారు. ముల్కలపల్లి మండలం పూసుగూడెం పంప్ హౌస్ 2 స్విచ్ ఆన్ చేసిన మంత్రులు.. ట్రయల్ రన్ విజయవంతంగా ప్రారంభించారు. అనంతరం డెలివలి ఛానల్ వద్ద గోదారమ్మకు మంత్రులు ప్రణమిల్లారు. కమలాపురం పంప్ హౌస్ 3 ట్రయల్ రన్ ను మంత్రులు ప్రారంభించారు. అయితే, ఈ నెల 15న సీతారామ ప్రాజెక్ట్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Read Also : Crows Attack : మగవాళ్లపై పగబట్టిన కాకులు..! కాలితో తన్నుతూ దాడి చేస్తున్న వైనం.. వీడియో వైరల్

సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభం అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉమ్మడి ఖమ్మం జిల్లా పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నానని తుమ్మల అన్నారు. ఇందిరా సాగర్ భూభాగం ఆంధ్రాలో కలవడం, రాజీవ్ సాగర్ అటవీ ప్రాంతం సమస్యల వల్ల సీతారామ ప్రాజెక్ట్ కు రూపకల్పన జరిగింది. గత ప్రభుత్వంలో ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగాయి. పంప్ హౌస్ ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరితగతిన పూర్తి చేయాలని, కృష్ణా జలాలు సకాలంలో రాకపోతే ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో వైరా లింక్ కెనాల్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సత్తుపల్లి ట్రంక్ పనుల్లో యాతాలకుంట టన్నెల్ పూర్తి చేయాలనన్నారు. జూలూరుపాడు టన్నెల్ పనులు పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు చేరుతాయి. ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టు ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవుతుందని తుమ్మల చెప్పారు.

Read Also : Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ ఇంటివద్ద కొనసాగుతున్న హైడ్రామా.. అక్కడే నిద్రించిన భార్యాబిడ్డలు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా చిరకాల కోరిక నెరవేరింది. సీతారామ ప్రాజెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, ఇల్లందు మినహా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందని మంత్రి చెప్పారు.