Crows Attack : మగవాళ్లపై పగబట్టిన కాకులు..! కాలితో తన్నుతూ దాడి చేస్తున్న వైనం.. వీడియో వైరల్
మగవాళ్లపై కాకులు పగబట్టాయి. కేవలం మగవాళ్ల తలపై కాళ్లతో తన్నుతూ కాకులు దాడి చేస్తున్నాయి. విచిత్రంగా ఉన్నా ...

Crows Attack
Crows Attack in Sircilla : మగవాళ్లపై కాకులు పగబట్టాయి. కేవలం మగవాళ్ల నెత్తిపై కాళ్లతో తన్నుతూ దాడి చేస్తున్నాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా నమ్మితీరాల్సిందే. ఇందుకు సంబంధించిన వీడియోసైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పాత బస్టాండ్ లో కట్టమైసమ్మ గుడివద్ద తిరుగుతున్న మగవాళ్లపై కాకులు కాళ్లతో దాడి చేస్తున్నాయి. బస్టాండ్ నుంచి బయటకు వెళ్లే వారిపై, లోపలికి వచ్చే మగవాళ్లను మాత్రమే తలపై తన్నుతూ చెట్టు కొమ్మపైకి వెళ్లి వాలుతున్నాయి.
Read Also : kieron Pollard : రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సర్ల మోతమోగించిన పొలార్డ్.. వీడియో వైరల్
కాకుల విచిత్ర ప్రవర్తన చూసి స్థానికులు షాకవుతున్నారు. కేవలం కొన్ని కాకులు మాత్రమే ఇలా ప్రవర్తిస్తుండటంతో ఎందుకు అవి అలా ప్రవర్తిస్తున్నాయో అర్థంకాక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాకుల దాడులతో బస్టాండ్ లోపలికి వచ్చిపోయేవారు ఉలిక్కిపడుతున్నారు. బస్టాండ్ ఎంట్రన్స్ లో కట్టమైసమ్మ గుడి ప్రాంతంలో చెట్లపై పదుల సంఖ్యలో కాకుల గూళ్లు ఉన్నాయి. మగవాళ్లు అటువైపు రాగానే అవి చెట్టపైనుంచి ఎగురుకుంటూ వచ్చి వారి తలపై కాళ్లతో తన్నుకుంటూ వెళ్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.
Read Also : Duvvada Srinivas : దువ్వాడ శ్రీనివాస్ ఇంటివద్ద కొనసాగుతున్న హైడ్రామా.. అక్కడే నిద్రించిన భార్యాబిడ్డలు
మగవాళ్లను కాలితో తన్నుతూ దాడి చేస్తున్న కాకులు
సిరిసిల్ల – పాత బస్టాండ్లో కట్ట మైసమ్మ గుడి వద్ద అక్కడ తిరుగుతున్న మగవాళ్ల పై దాడి చేస్తున్న కాకులు
బస్టాండ్ నుండి బయటకి వెళ్ళే, లోపలికి వచ్చే మగ వాళ్లను మాత్రమే తలపై తంతు చెట్టు కొమ్మ పై వాలుతున్న కాకులు pic.twitter.com/HRLUUQVdYS
— Telugu Scribe (@TeluguScribe) August 10, 2024