Telangana Congress : ఫలితాలకు ముందే కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.. ఎన్నికల ఇన్‌ఛార్జిలుగా ఐదుగురికి బాధ్యతలు..

ఫలితాలు రాకముందే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టారు. ఢిల్లీలోని ఏఐఐసీ కార్యాలయం వద్ద కార్యకర్తల సందడి మొదలైంది. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

congress party

Telangana Election 2023 Result : నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపులో అధికారులు నిమగ్నమయ్యారు. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. నాలుగు రాష్ట్రాల్లో విజయం మాదేనని కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటిరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు అంచనా వేశాయి. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఫలితాలు రాకముందే కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మొదలు పెట్టారు. ఢిల్లీలోని ఏఐఐసీ కార్యాలయం వద్ద కార్యకర్తల సందడి మొదలైంది. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Also Read : Telangana Assembly Election 2023 Result : తెలంగాణలో ఓట్ల లెక్కింపు ఇలా.. ఆరు నియోజకవర్గాల్లో లెక్కింపునకు అధిక సమయం.. ఎందుకంటే?

నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో పక్కాగా అధికారంలోకి వస్తామని భావిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఇన్ ఛార్జిలను రంగంలోకి దింపింది. తెలంగాణకు ఎన్నికల ఇన్ఛార్జిలుగా ఐదు మంది నేతలకు ఏఐసీసీ బాధ్యతలు అప్పగించింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, దీపాదాస్ మున్షి, అజోయ్ కుమార్, కె. మురళిధరన్, కేజే జార్జ్ లకు బాధ్యతలు అప్పగించింది. ఈ ఐదుగురు ఇన్ ఛార్జి నేతలు ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ సరళిని వీరు ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు.

Also Read : CM for 4 States: ఎగ్జిట్ పోల్స్ సరే.. ఇంతకీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటే ప్రజలు చెప్పిన సమాధానం ఏంటి?

మరోవైపు విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థులను వెంటనే క్యాంపుకు తరలించేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళిక సిద్ధం చేసింది. కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే క్యాంపు ను ఏర్పాటు చేసిన అధిష్టానం.. ఎన్నికల ఫలితాల సరళిని భట్టి అభ్యర్థులను క్యాంపుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కొంతమంది కాంగ్రెస్ అభ్యర్థులను ఇప్పటికే హైదరాబాద్ పిలిపించినట్లు తెలిసింది.