CM for 4 States: ఎగ్జిట్ పోల్స్ సరే.. ఇంతకీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటే ప్రజలు చెప్పిన సమాధానం ఏంటి?

సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారం అవుతున్నవారిలో ఎవరిని ఎంత మంది ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారో ఓసారి చూద్దాం.

CM for 4 States: ఎగ్జిట్ పోల్స్ సరే.. ఇంతకీ కాబోయే ముఖ్యమంత్రి ఎవరంటే ప్రజలు చెప్పిన సమాధానం ఏంటి?

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం (డిసెంబర్ 3) జరగనుంది. దీనికి ముందు ఏబీపీ న్యూస్-సీ ఓటర్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్‌లో ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎంపికకు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రచారం అవుతున్నవారిలో ఎవరిని ఎంత మంది ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారో ఓసారి చూద్దాం.

రాజస్థాన్‌
అశోక్ గెహ్లాట్ – 36 శాతం
సచిన్ పైలట్ – 18 శాతం
వసుంధర రాజే – 23 శాతం
గజేంద్ర షెకావత్ – 5 శాతం
రాజేంద్ర రాథోడ్ – 4 శాతం
ఇతరులు – 14 శాతం

మధ్యప్రదేశ్‌
శివరాజ్ చౌహాన్ – 32 శాతం
కమల్ నాథ్ – 41 శాతం
జ్యోతిరాదిత్య సింధియా – 10 శాతం
ఇతరులు – 17 శాతం

ఛత్తీస్‌గఢ్‌
భూపేష్ బఘేల్ – 40 శాతం
రమణ్ సింగ్ – 29 శాతం
టీఎస్ సింగ్‌దేవ్ – 8 శాతం
ఇతరులు – 23 శాతం

తెలంగాణ
కేసీఆర్ – 34 శాతం
బండి సంజయ్ – 14 శాతం
రేవంత్ రెడ్డి – 35 శాతం
ఒవైసీ – 1 శాతం
ఇతరులు – 16 శాతం