Telangana : కేఆర్ఎంబీ చైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు లేఖ

నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ప్రవాహ సామర్థ్యాలలో అసమానతలను సవరించాలని కోరుతూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు.. కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు.

Letter to KRMB Chairman : నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల ప్రవాహ సామర్థ్యాలలో అసమానతలను సవరించాలని కోరుతూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు.. కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు. 1952 సంవత్సరంలో ఆంధ్ర, హైదరబాద్ రాష్ట్రాల మధ్య కుదిరిన అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం నాగార్జునసాగర్ కుడి కాలువ(ఆంధ్ర వైపు), ఎడమ కాలువ(తెలంగాణ వైపు) హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాలు సమానంగా ఉండాలని లేఖలో పేర్కొన్నారు.

నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ విడుదల సామర్థ్యం నాగార్జునసాగర్ నీటి మట్టం +500 అడుగుల వద్ద 11,000 క్యూసెక్కులు ఉంటే, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ విడుదల సామర్థ్యం నాగార్జునసాగర్ లొ నీటి మట్టం +520 అడుగుల ఉంటేనే 11,000 క్యూసెక్కులు వీలవుతుందని తెలిపారు.

YS Sharmila : వైఎస్ షర్మిలతో ఐప్యాక్ ప్రతినిధులు భేటీ..తెలంగాణలో పాదయాత్రపై చర్చ

ఎండీడీఎల్ 510 అడుగుల వద్ద ఎడమ కాలువ విడుదల సామర్థ్యం 7,899 క్యూసెక్కులు ఉండగా కుడి కాలువ విడుదల సామర్థ్యం 24,606 క్యూసెక్కులు ఉందన్నారు. ఇది రెండు కాలువల్లో ఉన్న తీవ్రమైన అసమానతన్నారు. నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువల హెడ్ రెగ్యులేటర్ల విడుదల సామర్థ్యాల్లో ఈ అసమానతను సరిదిద్దాలన్నారు. ఎండీడీఎల్ +510 అడుగుల వద్ద రెండు కాలువల విడుదల సామర్థ్యం సమానంగా ఉండాలని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాగర్ కుడి కాలువ ఆయకట్టుకు ఇతర మార్గాల ద్వారా సాగు నీటి సరఫరాకు అవకాశం ఉన్నందున వారు కృష్ణ నీటిని బేసిన్ లో ఉన్న తెలంగాణకు వదిలేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యూనల్ ను కోరిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు