Liquor Tenders
Telangana Liquor Tenders : తెలంగాణలో కొత్త మద్యం టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. అంచనాలను తలకిందులు చేస్తూ ఊహించని రీతిలో దరఖాస్తులు పోటెత్తాయి. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపు దరఖాస్తులు వచ్చాయి. 2023-25 మద్యం విధానానికి ఏకంగా 1 లక్షా 31 వేల 490 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
క్రితం సారి మద్యం విధానంలో సుమారు 69 వేల దరఖాస్తులు రాగా, ఈసారి గరిష్టంగా లక్ష వస్తాయని అంచనా వేశారు. కానీ చివరి రెండు రోజుల్లోనే 87 వేల పైగా దరఖాస్తులు రావడం విశేషం. పలువురు రాజకీయ ప్రముఖులు రంగంలోకి దిగడమే ఇందుకు కారణమనే ప్రచారం జరుగుతోంది.
Karnataka Govt Excise Duty : మద్యంపై ఎక్సైజ్ సుంకం పెంచిన ప్రభుత్వం
వచ్చే డిసెంబర్ నుంచి ఏడాదిపాటు వరుస ఎన్నికలకు అవకాశముండటంతో పలువురు ఈ రంగంలోకి ప్రవేశించినట్లుగా ఎక్సైజ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, మల్కాజ్ గిరి ఎక్సైజ్ జిల్లాలపై వీరు కన్నేసినట్లుగా తెలుస్తోంది.
రాబోయే రోజుల్లో వాకిన్ స్టోర్లను ఇబ్బడిముబ్బడిగా తెరిచే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు దరఖాస్తులకు డీడీలు తీసేందుకు వ్యాపారస్తులు 2 వేల రూపాయల నోట్లను పెద్ద మొత్తంలో వినిగియోగించినట్లు తెలుస్తోంది.
Drinking Alcohol : ఖాళీ కడుపుతో మద్యం సేవిస్తున్నారా ? అయితే మీ ఆరోగ్యం మరింత డేంజర్ లో పడ్డట్టే !
సరూర్ నగర్ ఎక్సైజ్ యూనిట్ కు 8883, శంషాబాద్ ఎక్సైజ్ యూనిట్ కు 8749 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కొక్క దరఖాస్తుకు రూ. లక్షల చొప్పున వసూలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు. సోమవారం(ఆగస్టు 21,2023) లక్కీ డ్రా తీయనున్నారు.