Rains in Telangana: తెలంగాణకు మూడు రోజులపాటు వర్ష సూచన

: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది

Rains

Rains foreseen in Telangana: తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో శని, ఆది, సోమవారం వరకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ సంచాలకులు పేర్కొన్నారు. ఆగ్నేయ దక్షిణ దిశల నుండి తెలంగాణ వైపు వీస్తున్న గాలుల కారణంగా చలితీవ్రత తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో ఉత్తరభారతం నుంచి వీస్తున్న చల్లని గాలుల కారణంగా మంచు పొరలు ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది.

Also read: Pigeon Race: పావురం పందాలు.. తమిళనాడులో క్రేజీ రేసింగ్ హిస్టరీ తెలుసుకోండి

ప్రధానంగా అదిలాబాద్, కుమరం భీమ్, మంచిర్యాల, జగిత్యాల మరియు నిర్మల్ జిల్లాలలో జనవరి 10, 11న వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది. తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల కారణంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయి. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరో వైపు ఉత్తరభారతాన్ని మంచుదుప్పటి కమ్మేసింది. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, రాష్ట్రాల్లో భారీ హిమపాతం నమోదు అయింది.

Also read: Child Dead : ముక్కు సర్జరీకి వెళ్తే ప్రాణమే పోయింది.. ప్రైవేట్ హాస్పిటల్ లో దారుణం.. !