Pigeon Race: పావురం పందాలు.. తమిళనాడులో క్రేజీ రేసింగ్ హిస్టరీ తెలుసుకోండి

పావురాల ఆటను ఆధారంగా చేసుకుని తమిళనటుడు ధనుష్ హీరోగా "మారీ" అనే చిత్రం కూడా వచ్చింది. పావురాల రేసింగ్ గురించే సినిమా తీశారంటే ఈ ఆట గురించి తప్పక తెలుసుకోవాలి మరి.

Pigeon Race: పావురం పందాలు.. తమిళనాడులో క్రేజీ రేసింగ్ హిస్టరీ తెలుసుకోండి

Pigeon

Pigeon Race:  సంక్రాంతి పండగ వచ్చిందంటే మన గోదావరి జిల్లాలో కోడి పందాలు జరుగుతుంటాయి. చిన్నాపెద్దా అందరు కలిసి ఈ కోడి పందాలు చూసేందుకు ఉత్సాహం కనబరుస్తారు. మన గోదావరి జిల్లాల్లో జరిగే ఈ కోడి పందాల గురించి అందరికీ తెలుసు. మరి తమిళనాడులో జరిగే పావురాల పందాల గురించి మీరెప్పుడైనా విన్నారా?. అవును పావురాల రేసింగ్ గా పిలిచే ఈ రకమైన ఆట అనాది కాలంగా తమిళనాడులో నిర్వహిస్తుంటారు. ఈ పావురాల ఆటను ఆధారంగా చేసుకుని తమిళనటుడు ధనుష్ హీరోగా “మారీ” అనే చిత్రం కూడా వచ్చింది. పావురాల రేసింగ్ గురించే సినిమా తీశారంటే ఈ ఆట గురించి తప్పక తెలుసుకోవాలి మరి.

ఇటీవల తమిళనాడులోని కోయింబత్తూర్ కు చెందిన ఎస్.ఉదయన్ అనే వ్యక్తికి చెందిన ఒక పావురం ఏకబిగిన 85 గంటల 11 నిముషాల పాటు గాల్లో ఎగిరి రికార్డు సృష్టించింది. కోయింబత్తుర్ లోని కెంపట్టి కాలనీలో ఉదయం 7 గంటలకు వదిలిన పావురం.. సాయంత్రం 7 గం.ల 53 నిముషల వరకు ఎగురుతూనే ఉంది. అలా.. ఒక రోజులో 10 గంటల పాటి కంటిన్యూస్ గా ఎగిరిన పావురాన్నే మరుసటి రోజుకు కన్సిడర్ చేస్తారు. ఇలా ఎగిరిన ఉదయన్ పావురం.. అంత క్రితం నెలకొల్పిన 83 గంటల 49 నిమిషాల రికార్డును.. బద్దలు కొట్టింది. ఇది కోయింబత్తుర్ తో పాటు తమిళనాడులోని ఇతర పావురాయి రేసింగ్ క్లబ్ ల దృష్టిలో పడింది. ఇంతవరకు తమిళనాడు పావురాల రేసింగ్ చరిత్రలోనే ఇంత దూరం ప్రయాణించిన పావురం లేదంటూ.. ఈ రికార్డును గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలని ఉదయన్ కోరుతున్నాడు.

ఈ పావురాల రేసింగ్ గోల ఏంట్రా బాబు..! అనుకుంటున్నారా? ఆమాత్రం గోల లేకుండా రేసింగ్ ఉండదు కదా. పావురాల రేసింగ్ ను తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ప్రెస్టేజ్ గా తీసుకుంటారు. అందులో డబ్బు సంపాదన కంటే తమ పావురం వెనక్కు తిరిగిరావడం, గెలుపోటములకే వారు ఎక్కువ విలువిస్తారు. అందుకే ఒక్కొక్కరు 40 నుంచి 200 పావురాలను పెంచి పోషిస్తుంటారు.

పందెంలో గెలిచేందుకు పావురం బలంగా ఉండేందుకు వాటికి రాగులు, సజ్జలు, జీడి పప్పు, బాదం పిస్తాలు బాగా తినిపిస్తారు. ఒక్కోసారి వీటి ఆహారానికి అయ్యే ఖర్చు ఏడాదికి సరాసరిగా రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలు ఉంటుందని చెన్నై రాయల్ పిజియన్ సొసైటీ సెక్రటరీ ఓపీ విజయకుమార్(55) అంటున్నారు. విజయకుమార్ కుమారుడు కూడా ఈ పావురాల పందాలు నిర్వహిస్తుంటారు. ఆ యువకుడు తమిళనాడులోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీ VITలో ప్రస్తుతం ఇంజినీరింగ్ చదువుతున్నాడు. ఇంజినీరింగ్ చదువుతున్న యువకుడే ఇలా పావురాల పందాలపై మక్కువ పెంచుకున్నాడంటే.. ఏళ్లకేళ్లుగా వాటిని సాకుతున్న యజమానులు ఎలా ఉంటారో అర్ధం చేసుకోండి.

Also read: Corona Symptoms : జ్వరం వస్తే కరోనా కాదు.. అసలు లక్షణాలు ఏంటి? వైద్యనిపుణులు ఏమంటున్నారు?

శతాబ్దాలుగా పావురాల పందాలు

ఇదేదో ఈమధ్యకాలంలో ప్రాచుర్యం పొందిందని అనుకుంటున్నారా? కానే కాదు. వందల సంవత్సరాల నుంచి ఈ “కపోతాల ఎగురుడు పందాలు” జరుగుతున్నాయి. కొన్ని చారిత్రక రికార్డులను పరిశీలించగా దాదాపు క్రీస్తుశకం 220 సంవత్సరం నుంచి పావురాల పందాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఎస్.ఉదయన్ న్నే ఉదాహరణగా తీసుకుంటే.. తన తండ్రి, తాతలు, ముత్తాతలు పావురాల రేసింగ్ లు నిర్వహించారట. 55 ఏళ్ల విజయకుమార్ తన తండ్రి, తాతల నుంచే పావురాల రేసింగ్ నేర్చుకున్నానని చెబుతున్నాడు. బ్రిటిషర్ల కాలం నుంచి తమిళనాడులో ఈ పావురాల పందాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రేసింగ్ లు నిర్వహించేందుకు ప్రాంతాల వారీగా “పిజియన్ వెల్ఫేర్ అసోసియేషన్”లు ఏర్పాటు అయ్యాయి. ఈ అసోసియేషన్ లోని సభ్యులే రేసింగ్ లోని గెలుపోటములను నిర్ణయిస్తారు. తనమన తారతమ్యం లేకుండా అందరి సమక్షంలో ఫలితాన్ని విశ్లేషించి వెల్లడిస్తారు.

అన్ని గంటల పాటు గాల్లో ఎగిరే పావురం రేసింగ్ ను ఎలా లెక్కిస్తారు?

సాధారణంగా భూసంచారాన్ని లెక్కించేందుకు జీపీఎస్ పరికరాన్ని వినియోగిస్తారు. కానీ పావురాలకు ఆ పరికరం కట్టాలంటే చాలా బరువు ఉంటుంది. అందుకే వాటి కాళ్లకు ఒక ప్రత్యేకమైన ట్రాకర్ రింగ్ ను అమర్చుతారు. ఖర్చు తక్కువగానూ, బరువు తేలికగానూ ఉండే ఈ ట్రాకర్ ద్వారా పావురం ఏ ప్రాంతంలో సంచరించి వచ్చింది, ఆప్రాంతం ఎంత దూరంలో ఉంది, అనే విషయాన్ని లెక్కగడతారు. పావురం తిరిగి గూటికి చేరుకున్నాక ఆ ట్రాకర్ ను తొలగించి, పావురం వెళ్లి వచ్చిన సమయాన్ని ఆధారంగా.. వేగాన్ని, దూరాన్ని, గాల్లో ఎగిరిన సమయాన్ని లెక్కిస్తారు. మిగతా పావురాల లెక్కలను పరిశీలించిన అనంతరం విజేతలను నిర్ణయిస్తారు. పావురాల ఇంద్రియాల్లో సహజంగానే మాగ్నెటోరెసెప్షన్‌ అనే సెన్సార్ ఉంటుంది. తద్వారా భూఅయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించి.. ఎత్తు, దిశ, మరియు ప్రాంతాన్ని పావురం లెక్కించుకుంటుంది. దీంతో అది ఎంత సమయం గాల్లో ఉండగలదు అనే విషయాన్నీ గ్రహిస్తుంది. రేసింగ్ కు వెళ్లే పావురాల్లోనే ఈరకమైన శక్తి ఉంటుంది. ఇదే శక్తి పావురం అన్ని గంటల పాటు గాల్లో ఉండేందుకు తోడ్పడుతుంది.

Also read: UP : బీజేపీ జన విశ్వాస్ యాత్ర కాదు..యూపీ అంతా క్షమాపణ యాత్ర చేయాలి : అఖిలేష్ యాదవ్

బహుమానం ఎంతంటే..?

ఇంత జరిగి ఈ పావురాల రేసింగ్ లో విజేతలకు వచ్చే నగదు బహుమానం ఎంతో తెలుసా? మహా అయితే రూ.5000. అయితే ఇక్కడ బహుమతి ప్రధానం కాదు, ప్రెస్టేజ్. తమ పావురం విజేతగా నిలవడాన్ని వారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గెలిచిన వారు..పావురాలను పోషించి వాటిని ఎక్కువ ధరకు మార్కెట్లో అమ్ముకుంటుంటారు. అదే వారి ప్రధాన ఆదాయ మార్గం అనికూడా చెప్పవచ్చు. ఇటీవల చైనాలో ఒక రేసింగ్ పావురం ధర ఏకంగా $1.4 మిలియన్ డాలర్లు పలికింది. దీన్నిబట్టే అర్ధం చేసుకోవచ్చు.. పావురాల రేసింగ్ ఏ స్థాయిలో ఉందో. మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుగుతున్న ఈ పావురాల రేసింగ్.. దక్షిణ పశ్చిమ చైనాలో పూర్తి స్థాయిలో జరుగుతుంటుంది. మరో మాటలో చెప్పాలంటే చైనాను పావురాల రేసింగ్ క్యాపిటల్ గా పిలుస్తుంటారు. చైనా పావురాలు 200కిమీ నుంచి 1500 కిమీల దూరం ఏకబిగి ప్రయాణిస్తుంటాయి.

అయితే అన్ని పావురాలు ఈ రేసింగ్ లకు పనికి రావు. కేవలం కొన్ని జాతులు మాత్రమే ఇలాంటి పనులకు వినియోగిస్తుంటారు. క్యాట్రిస్సే( Cattrysse), కొలంబియా లివియా డొమెస్టికాటా (Columbia livia domesticata) అనే వంశపారంపర్యమైన జాతుల పావురాలనే ఈ రేసింగ్ లో వినియోగిస్తారు. వీటికి ప్రత్యేకమైన గ్రాహణశక్తి ఉండడమే కారణం. ఇక చివరగా..పావురాల వలన మనుషులకు కల్గిన లాభం ఏంటంటే.. సమాచారం చేరవేత!.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పావురాలతో సమాచారం, సందేశం పంపించుకునేవారు. అలా 1942 ఫిబ్రవరి 23న “వింకీ” అనే పావురం ఏకంగా 125 మైళ్ళ దూరం సముద్రం మీదుగా ప్రయాణించి సముద్రంలో మునిగిన యుద్ధ విమానం గురించి సమాచారం చేరవేసింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూకేకి చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానం ఒకటి సముద్రంలో కుప్పకూలింది. అందులో ఉన్న సైనికులు, పైలట్లు సముద్రంలో చిక్కుకుపోయారు. అదే సమయంలో తమ వద్దనున్న “వింకీ” పావురంతో.. తమ బేస్ క్యాంపుకి సందేశాన్ని చేరవేశారు. సకాలంలో స్పందించిన దాని యజమాని సైనికాధికారులకు సమాచారం అందించడంతో సముద్రంలో చిక్కుకున్నవారిని రక్షించారు. ఇది ఈ పావురాల కథాకమామిషు. అన్నట్టు.. ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో చైనా పావురాల గూఢచర్యంపై సంచలన వార్తలు వచ్చాయి. దానికీ దీనికి లింక్ ఉండొచ్చన్న ఊహాగానాలున్నాయి.

Also read: Election Schedule : మధ్యాహ్నం 3.30 గంటలకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్