Election Schedule : మధ్యాహ్నం 3.30 గంటలకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా లో పర్యటించిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, రాజకీయ పార్టీలతో సమావేశాలు, అధికార యంత్రాంగంతో ఎన్నికల నిర్వహణపై చర్చించారు.

Election Schedule : మధ్యాహ్నం 3.30 గంటలకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్

Cec

five state assembly elections : దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నగారా మోగనుంది. నేడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేయనుంది. యూపీ, పంజాబ్, గోవా, ముణిపూర్, ఉత్తరాఖండ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఎన్నికలు జరగాల్సిన ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా లో పర్యటించిన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర, ఇతర ఉన్నతాధికారులు రాజకీయ పార్టీలతో సమావేశాలు, అధికార యంత్రాంగంతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు.

మణిపూర్ లో రాజకీయ పార్టీలు, అధికార యంత్రాంగంతో వర్చువల్ గా కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష చేసింది. కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే రెండుసార్లు సమీక్షించింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించేందుకు కసరత్తు పూర్తి చేసింది. బహిరంగ ర్యాలీలు, ప్రదర్శనలపై నిషేధం విధించే యోచనలో ఉంది.

Corona : తెలంగాణ సచివాలయంలో ఐదుగురికి కరోనా పాజిటివ్

ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలతో పాటు కొత్తగా మరికొన్ని మార్గదర్శకాలను విధించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ లో బహిరంగ ర్యాలీలు, ప్రదర్శనలను ఉపసంహరించుకుంది. అదే బాటలో నడిచేందుకు బీజేపీ సహా ఇతర పార్టీలు సిద్ధమయ్యాయి. అన్ని పార్టీలకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. రైతు చట్టాలు రద్దు చేసిన తర్వాత తొలి ఎన్నికలు జరుగనున్నాయి. రైతు అంశాలు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి.

దేశంలో కరోనా, ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతున్న క్రమంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కానీ వాటన్నింటిని ఈసీ చెక్ పెడుతూ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్, గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఇప్పటికే ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అయితే ఒమిక్రాన్ తీవ్ర రూపం దాలుస్తున్న క్రమంలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచన చేసి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ఇటీవల కేంద్రానికి సూచించిన ఎన్నికల కమిషన్ తాజాగా ఇదే విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని ఐదు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను తాజా లేఖలో ఈసీ కోరింది.

Selfie Video : రామకృష్ణ ఆత్మహత్య కేసులో మరో సెల్ఫీ వీడియో.. సంచలన విషయాలు వెల్లడి

దేశంలో అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో తొలిస్థానంలో ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌ లో దాదాపు 14.66కోట్ల మంది ఓటర్లున్నారు. పంజాబ్‌లో రెండు కోట్లు, ఉత్తరాఖండ్‌ లో 78 లక్షలు, మణిపూర్‌లో 19.58 లక్షలు, గోవాలో 11.45 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. శాసనసభ ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లో మొత్తం దాదాపు 17.84కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఐదు రాష్ట్రాల్లోని ఓటర్ల మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఏబీపీ న్యూస్ మరియు సీ ఓటర్ సంస్థ నిర్వహించిన నెలవారీ సర్వేలో ఐదు రాష్ట్రాల్లో హోరాహోరీ పోరాటం ఉన్నప్పటికీ బీజేపీకి అడ్వాంటేజ్ ఉన్నట్లుగా తేలింది.

ఉత్తరప్రదేశ్ లో 403 స్థానాలు
ఉత్తరాఖండ్ లో 70 స్థానాలు
గోవాలో 40 స్థానాలు
మణిపూర్‌లో 60 స్థానాలు
పంజాబ్ లో 117 స్థానాలు