Telangana Government : తెలంగాణ ప్రభుత్వ విప్‌లుగా నలుగురు ఎమ్మెల్యేలు నియామకం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విప్‌లుగా నలుగురిని నియామకం అయ్యారు.

Telangana Government

Telangana Congress : తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక శాఖల్లో అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌లుగా నలుగురు ఎమ్మెల్యేలను నియామకం చేశారు. వారిలో రాంచందర్ నాయక్, బీర్ల ఐలయ్య, అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ ఉన్నారు.

అడ్డూరి లక్ష్మణ్ ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై విజయం సాధించారు.

బీర్ల ఐలయ్య ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతపై విజయం సాధించారు.

ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మీ నర్సింహారావుపై విజయం సాధించారు.

జాటోత్ రామచంద్రు నాయక్ డోర్నకల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్యా నాయక్ పై విజయం సాధించారు.

ట్రెండింగ్ వార్తలు