Doctors Private Practice
Doctors Private Practice : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సవరించింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు ఇకపై ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రైవేట్ ప్రాక్టీస్ పై నిషేధం విధిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. డాక్టర్లు అందుబాటులో లేకుండా ఉంటుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగి, ఇదివరకే ఉద్యోగాల్లో ఉన్న డాక్టర్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చంది. దానిపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు.
సాధారణంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే డాక్టర్లు ఎక్కువమంది ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుంటారు. వాటిపైనే ఎక్కువ దృష్టి సారిస్తుంటారు. ఇకపై ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అందుకోసం కసరత్తు చేపట్టింది. ఈ తరుణంలో నియామక మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు అంశం కీలకంగా మారింది.(Doctors Private Practice)
HarishRao Kondapur Area Hospital : లంచం అడిగిన డాక్టర్.. సస్పెండ్ చేసిన మంత్రి హరీశ్ రావు
ప్రైవేట్ ప్రాక్టీస్ కారణంగా ఎక్కువమంది డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. దీన్ని సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. అయితే, తొలి దశలో కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకునే ప్రభుత్వ వైద్యులకు మాత్రమే ఈ నిబంధనలు వర్తింపజేసింది ప్రభుత్వం.
Harish Rao: ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అవసరం లేకున్నా.. ఆపరేషన్‌లు చేస్తున్నారు – హరీష్ రావు
రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులతో రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం నిర్ణయం గురించి వెల్లడించారు. ఈ నిబంధనలు పాటించని వైద్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో త్వరలో 1,326 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని మెడికల్ బోర్డును ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్‌పై తాజాగా ప్రభుత్వం విధించిన నిబంధన గురించి ప్రస్తావించారు.
వైద్య, ఆరోగ్య శాఖలో మొత్తం 12వేల 755 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించారు. తొలి దశలో 1,326 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఇందుకోసం ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Telangana Covid List Update : తెలంగాణలో పెరుగుతున్న కరోనా యాక్టివ్ కేసులు
భర్తీ చేయనున్న పోస్టుల్లో టీవీవీపీ, వైద్య విద్య, ప్రజారోగ్యం విభాగాలు ఉన్నాయి. 1,326 పోస్టుల్లో టెక్నికల్, ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను టీఎస్‌పీఎస్‌సీ ద్వారా భర్తీ చేయనున్నారు. నిమ్స్‌లోని ఖాళీలు నిమ్స్ బోర్డు ద్వారా, ఆయుష్, ఇతర అన్ని పోస్టులను మెడికల్ నియామక బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.
Minister HarishRao: ప్రభుత్వాసుపత్రులు ప్రక్షాళన దిశగా కృషిచేస్తున్నాం: ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు