Harish Rao: ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అవసరం లేకున్నా.. ఆపరేషన్‌లు చేస్తున్నారు – హరీష్ రావు

 భూపాలపల్లిలో PHCస్థాయి నుండి మెడికల్ కాలేజీ స్థాయికి ఎదగడం శుభసూచికంగా అభివర్ణించారు హరీష్ రావు. ఏడాది వ్యవధిలో భూపాలపల్లి వ్యాప్తంగా 650 సిజేరియన్ డెలివరీలు జరిగితే 30మాత్రమే నార్మల్ ప్రసవాలు అయ్యాయని చెప్తూ..

Harish Rao: ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అవసరం లేకున్నా.. ఆపరేషన్‌లు చేస్తున్నారు – హరీష్ రావు

Harisha Rao

Harish Rao: భూపాలపల్లిలో PHCస్థాయి నుండి మెడికల్ కాలేజీ స్థాయికి ఎదగడం శుభసూచికంగా అభివర్ణించారు హరీష్ రావు. ఏడాది వ్యవధిలో భూపాలపల్లి వ్యాప్తంగా 650 సిజేరియన్ డెలివరీలు జరిగితే 30మాత్రమే నార్మల్ ప్రసవాలు అయ్యాయని చెప్తూ.. అవసరమున్నా లేకున్నా ప్రైవేట్ హాస్పిటల్స్‌లో పెద్దాపరేషన్‌లు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.

“ప్రైవేట్ ఆస్పత్రులలో పూర్తిగా ఆపరేషన్లకు మాత్రమే ఫిక్స్ అయ్యారు. శుభముహూర్తాలు చూసుకొని ప్రసవాలు చేసుకోవడం మూర్కత్వం. సిజేరియన్స్ వల్ల తల్లి – పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం. ప్రైవేటు హాస్పిటల్స్‌కు వెళ్లి డబ్బులు వృధా చేసుకోకండి. ఆరోగ్యం పాడు చేసుకోకండి” అని సూచించారు.

“భూపాలపల్లితో పాటు తెలంగాణలోని 8 జిల్లాలో గర్భిణీ స్త్రీలలో రక్తహీనత ఎక్కువగా ఉందని గుర్తించాం. వారికి పౌష్టికాహారం అందించడం కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ అందిస్తున్నాం. జిల్లా కలెక్టర్లు, spల సతీమణులు కూడా ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రసవించేందుకు ముందుకొస్తున్నారని, ఇది శుభసూచికమని అభివర్ణించారు.

Read Also: ప్రభుత్వాసుపత్రులు ప్రక్షాళన దిశగా కృషిచేస్తున్నాం: ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు

“బీజేపీ – కాంగ్రెస్ రోడ్లమీద పడి యాత్రలు చేస్తున్నారు. ఒకడు మోకాళ్ళ యాత్ర – ఇంకొకరు పొర్లుదండాలు యాత్ర చేస్తున్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్రలో ఎలాంటి పరిస్థితులు ఉన్నయో చూడండి” అని సవాల్ విసిరారు.

“నడ్డాకు ధమాక్ లేకుండా మాట్లాడారు. కాళేశ్వరం జలాలు పల్లెల్లో ఎలా పరుగులు పెడుతున్నాయో రైతులు చూపిస్తారు రండి. ధమాక్ లేని మాటలు మాట్లాడితే ప్రజలు సహించరు. కేంద్ర మంత్రి పార్లమెంట్ లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదని ప్రకటిస్తే.. నడ్డా వచ్చి జూటా మాటలు మాట్లాడారన్నారు”

“కాంగ్రెస్ పాలన ఎలా ఉండేదో రైతులు మరిచిపోలేదు. కాంగ్రెస్ పాలన అంటేనే రైతు ఆత్మహత్యలు.. ఆకలి చావులు. మీదంతా కుర్చీల కొట్లాట.. ఓటుకు నోటు, సీఎం సీటుకు నోట్ల పార్టీ నేతలు నీతులు చెబుతున్నారు” అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.