Indiramma Housing Scheme
Indiramma Housing Scheme: తెలంగాణలోని అర్హత కలిగిన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు రేవంత్ సర్కార్ దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తొలి దశలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసింది. సర్వే అనంతరం 65వేల మంది లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 47వేల మంది లబ్ధిదారులకు కలెక్టర్లు ఇండ్లను సాంక్షన్ చేశారు. రీసర్వే పూర్తి అవుతున్నందున మిగతా వారికి కూడా త్వరలో కలెక్టర్లు ఇండ్లను సాంక్షన్ చేయనున్నారు. ప్రస్తుతం తొలి దశలో ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.
Also Read: Telangana Govt: టెన్త్ పాస్ అయిన విద్యార్ధినిలకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
తొలి దశలో ఇప్పటి వరకు 20వేల ఇండ్ల నిర్మాణం బేస్మెంట్ పనులు మొదలుకాగా.. ఇందులో 5వేల మంది బేస్మెంట్ నిర్మాణం పూర్తి చేశారు. ప్రభుత్వం నుంచి రూ.1లక్ష ఆర్థిక సాయం అందుకొని గోడలు కూడా నిర్మిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ పూర్తి చేస్తున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం తొలి దశ సాయం అందజేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా గత కొద్దిరోజుల నుంచి ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు తొలిదశ సాయాన్ని అధికారులు జమ చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 100మంది బేస్మెంట్, గోడలు, స్లాబ్, ప్లాస్టింగ్ పూర్తి చేశారు. ఈ నెలాఖరుకు మరో కొంత మంది స్లాబ్ పూర్తి చేయనున్నారు. ఈ నెల చివరిలో సీఎం చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
తొలి దశలో ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతుండగా.. రెండో విడుత లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక శనివారంతో ముగిసింది. 2.08లక్షల మందిని ఎంపిక చేసిన అధికారులు ఇందులో 1.05లక్షల మంది సర్వే పూర్తిచేసి కలెక్టర్లకు ఎంపీడీవోలు లిస్ట్ ను పంపించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదించగానే ఈనెల 12 నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నారు.