యూరియా కావాలనుకునే రైతులకు బిగ్ అలర్ట్.. యాప్ లోనే కాదు.. ఇక నుంచి ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు..
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో మాత్రమే ఉన్న యూరియా బుకింగ్ సేవను ఇకపై రాష్ట్రవ్యాప్తంగాఉన్న మీసేవ కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
Telangana government Key decision Farmers can also book urea at MeeSeva centers
- రైతులకు గుడ్న్యూస్ చెప్పిన సర్కార్
- మీసేవ కేంద్రాల్లోనూ యూరియా బుకింగ్
- రూ. 10మాత్రమే రుసుము
Telangana Govt : తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. రైతు భరోసా పథకం పేరుతో ప్రస్తుతం ఖరీఫ్ సాగుకు సంబంధించి పెట్టుబడి సాయాన్ని అర్హులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం విడుతల వారిగా జమ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు సాగు సమయంలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఎరువులను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Also Read : నాకు మూడు నెలలు చాన్స్ ఇవ్వు.. సీఎం రేవంత్ కు హరీశ్ సవాల్..
ప్రస్తుతం ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులకు యూరియాను ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ యాప్ ద్వారా బుకింగ్ సమయంలోనూ, బుకింగ్ తరువాత ఎరువులను అందుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లో కీలక మార్పులు చేశారు. అయితే, దీనికితోడు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో మాత్రమే ఉన్న యూరియా బుకింగ్ సేవను ఇకపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఫర్టిలైజర్ యాప్ను ఉపయోగించాలంటే స్మార్ట్ ఫోన్ ఉండాలి. చాలా మంది రైతులు స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేకపోవటంతో యూరియా బుకింగ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఫర్టిలైజర్ యాప్ ఉపయోగించలేని రైతులకోసం మీసేవ కేంద్రాల్లో కూడా యూరియా బుకింగ్ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులు తమ పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ద్వారా దగ్గరలోని మీసేవ కేంద్రానికి వెళ్లి యూరియా బుక్ చేసుకోవచ్చు.
బుకింగ్ విధానం ఇలా..
♦ మీసేవ ఆపరేటర్ పంట వివరాలు, సాగు విస్తీర్ణం నమోదు చేసి రైతు ఎంచుకున్న ఎరువుల డీలర్ వద్ద బుకింగ్ పూర్తి చేస్తారు.
♦ రైతు మొబైల్కు వచ్చే ఓటీపీ నమోదు చేసిన తర్వాత బుకింగ్ పూర్తవుతుంది. ఆ తరువాత బుకింగ్ ఐడీ ఇస్తారు.
♦ ఇందుకోసం రూ.10 మాత్రమే రుసుము ఉంటుంది.
♦ వ్యవసాయ శాఖ తెలిపిన ప్రకారం.. బుకింగ్ చేసిన రోజు మినహా మరో 48 గంటల వరకు మాత్రమే బుకింగ్ ఐడీ చెల్లుబాటు అవుతుంది.
♦ 48గంటలలోపు సంబంధిత డీలర్ వద్ద నుంచి యూరియా తీసుకోవాలి.
♦ రైతులు అధికారిక ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ లేదా మీసేవ కేంద్రాల ద్వారానే బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు
