CM Revanth Reddy
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా రాష్ట్రంలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఉద్యోగుల శాలరీ కష్టాలకు సర్కారుకు చెక్ పెట్టబోతోంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జీతాలను జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, ఈ ప్రక్రియ ఏప్రిల్ నెల నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య దాదాపు ఐదు లక్షల వరకు ఉంది. అయితే, వీరి జీతాల పంపిణీలో ఏజెన్సీలదే పైచేయిగా ఉంటూ వచ్చింది. ప్రభుత్వం నిధులను నేరుగా ఏజెన్సీల ఖాతాల్లో వేయడంతో వారు ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో భారీగా కోతలు విధిస్తున్నట్లుగా తేలింది. లేని ఉద్యోగుల పేరిట జీతాలు తీసుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నుంచి పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాలక ోసం నిధులు విడుదలైనప్పటికీ.. చాలా ఏజెన్సీలు వాటిని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీని వల్ల ప్రభుత్వ ఆదాయం దుర్వినియోగం అవుతుందని భావించిన అధికారులు.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వినిమం స్కేల్ పొందుతున్న ఉద్యోగులందరికీ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారానే చెల్లింపులు జరగనున్నాయి. దీంతో ప్రతినెలా వీరికి క్రమం తప్పకుండా జీతాలు అందే అవకాశం కలుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విధానంలో భాగంగా శాఖల వారిగా ప్రతి ఉద్యోగి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి కంప్యూటరీకరిస్తోంది. పేరు, ఆధార్ నెంబర్, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా వివరాలను ఒకే గొడుకు కిందికి తెలుస్తోంది.
ఏప్రిల్ నుంచి నేరుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే జీతాలను ప్రభుత్వం జమ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎఫ్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) విధానంలో జీతాలను సర్కారు చెల్లిస్తోంది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఇదే పద్ధతిలో మధ్య వర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుత ఐఎఫ్ఎంఎస్‌లోనే ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి వీరికి జీతాలు జమ చేయడమా.. లేదంటే వీరి కోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్ రెడీ చేయడమా? అనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.