Inter Students
Inter Student : ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ.. మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దాలని తెలంగాణ సర్కార్ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో సర్కారు కాలేజీలలో (Government Colleges) అడ్మిషన్లు పెంచడమే లక్ష్యంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు వెల్‌కమ్ కిట్ అందించాలని నిర్ణయం తీసుకుంది.
Also Read : Bheeshma Ekadasi : భీష్మ ఏకాదశి.. ఇవాళ అన్నం తినకూడదా..? తిన్నారో ఆ ఇబ్బందులు తప్పవ్..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 430 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా.. వాటిలో సుమారు 1.72 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ ఏడాది ఫస్టియర్ లో కొత్తగా 91వేల మంది చేరారు. అయితే, వచ్చే ఏడాది ఈ సంఖ్యను మరింత పెంచాలని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సర్కారు కాలేజీల్లో అడ్మీషన్లు పెంచడమే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఫస్టియర్ అడ్మిషన్లను 1.20 లక్షలకు చేర్చడమే టార్గెట్‌గా పనిచేస్తున్నారు. ఫిజిక్స్ వాలా, ఎడ్ టెక్ తదితర సంస్థల ద్వారా విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎప్ సెట్ తో పాటు క్లాట్ శిక్షణ ఇస్తున్నారు.
వచ్చే ఏడాది నుంచి కాలేజీలు ప్రారంభించిన మొదటి రోజే విద్యార్థులకు వెల్‌కమ్ కిట్ అందించాలని అధికారులు నిర్ణయించారు. ఈ వెల్‌కమ్ కిట్‌లో మొత్తం నాలుగు రకాల వస్తువులు ఉండనున్నాయి. తెలుగు అకాడమీకి చెందిన పాఠ్యపుస్తకాలతో పాటు నోటల్ బుక్స్, ఒక జత యూనిఫామ్, సబ్జెక్టుల ప్రాక్టీస్ కోసం వర్క్ బుక్‌లను ఈ కిట్‌లలో పొందుపరుస్తారు.
మరోవైపు.. ఇంటర్ విద్యా సంవత్సరాన్ని ఇకపై ముందుగానే ప్రారంభించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాధారణంగా టెన్త్ ఫలితాలు వచ్చాక జూన్ లో క్లాసులు మొదలవుతాయి. కానీ, ఇకపై ఆ ఆలస్యం లేకుండా, ఎగ్జామ్స్ అయిన వెంటనే క్లాసులు మొదలు పెట్టడం ద్వారా సిలబస్ త్వరగా పూర్తి చేయొచ్చునని అధికారులు భావిస్తున్నారు. తద్వారా విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేందుకు ఎక్కువ సమయం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.