తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు మొదలయ్యాయి. ఐఏఎస్ ఆమ్రపాలి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సతీమణి, ఐఏఎస్ శైలజా రామయ్యర్ కి కీలక బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. శైలజా రామయ్యర్ ను వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. శైలజా రామయ్యర్ ప్రస్తుతం యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
ఇక, కేంద్ర సర్వీసులు పూర్తి చేసుకుని తెలంగాణ వచ్చిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ డెవలప్ మెంట్ బోర్డు ఎండీగా ప్రభుత్వం నియమించింది. ముర్తుజా రిజ్వీని ఇంధన శాఖ కార్యదర్శిగా.. ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక, డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్.. ముషరప్ అలీ ఫరూక్ టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీగా నియమితులయ్యారు.
Also Read : రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో ఉపయోగకరం కాదు.. మరో రూట్‌లో మెట్రో ప్లాన్
తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు శాఖ అధికారులు, ఐపీఎస్ లు బదిలీ అయ్యారు. ఇప్పుడు ఐఏఎస్ ల ట్రాన్సఫర్లు మొదలయ్యాయి.
సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. అధికార ప్రక్షాళన దిశగా వెళ్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఏళ్లుగా ఒకే చోట పని చేసిన అధికారులకు స్థానచలనం కల్పిస్తున్నారు. ఈ పనిలో రేవంత్ రెడ్డి సర్కార్ బిజీగా ఉంది. నిన్నటి వరకు మూసీ రివర్ డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మన్ గా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడా బాధ్యతలను ఆమ్రపాలికి అప్పగించింది ప్రభుత్వం. విద్యుత్ అంశం ప్రభుత్వానికి కీలకంగా మారిన తరుణంలో ట్రాన్స్ కో జెన్ కో సీఎండీగా రిజ్వీని నియమించింది ప్రభుత్వం.
Also Read : 150 సీట్లు మార్చినా గెలవరు- వైసీపీలో మార్పులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు