CM Revanth Reddy : రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో ఉపయోగకరం కాదు.. మరో రూట్‌లో మెట్రో ప్లాన్

కొత్త వాహనాలను కొనుగోలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి ఏయిర్ పోర్టుకు మెట్రో ఉపయోగకరంగా ఉండదని అభిప్రాయపడ్డారు.

CM Revanth Reddy : రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రో ఉపయోగకరం కాదు.. మరో రూట్‌లో మెట్రో ప్లాన్

cm revanth reddy

Updated On : December 14, 2023 / 4:52 PM IST

CM Revanth Reddy : పాత అసెంబ్లీ బిల్డింగ్ లో కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పుడు ఉన్న అసెంబ్లీలోనే శాసనసభ జరుగుతుందన్నారు. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండబోతోందని తెలిపారు. ఎంసీహెచ్ఆర్డీలో ఉన్న కాళీ స్థలంలో సీఎం క్యాంపు ఆఫీస్ నిర్మాణం చేస్తానని చెప్పారు. ప్రజా భవన్ లో ఇంకో బిల్డింగ్ ఉందని, అది ఇంకో మంత్రికి ఇస్తానని చెప్పారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు.

ప్రజాభవన్ లో ఉన్న ఆఫీసు కార్యాలయాన్ని ఉపయోగించుకుంటానని చెప్పారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని పేర్కొన్నారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 12, 13 గంటలకు మించి విద్యుత్ ఇవ్వలేదన్నారు. శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామని చెప్పారు.

Also Read : పార్లమెంట్‌లో గందరగోళం.. 15 మంది ఎంపీల సస్పెన్షన్

రేపు (శుక్రవారం) బీఏసీ సమావేశం ఉంటుందన్నారు. శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొత్త వాహనాలను కొనుగోలు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో ఉపయోగకరంగా ఉండదని అభిప్రాయపడ్డారు. మరో రూట్‌లో మెట్రో ప్లాన్ చేస్తామని వెల్లడించారు.