×
Ad

తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు హ్యాక్.. అమ్మకానికి ఈ డేటా..

డేటాను సైబర్ నేరగాళ్లు డార్క్ వెబ్ సైట్‌లో అమ్మకాలకు పెట్టారు.

Telangana: తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లు హ్యాక్ అయ్యాయి. సెక్యూరిటీ లోపాలు ఉన్న విభాగాలను హ్యాకర్లు టార్గెట్ చేస్తూ డేటా చోరీ చేస్తున్నారు. అనేక విభాగాలకు సంబంధించిన డేటా డార్క్ వెబ్ సైట్‌లో కనపడింది.

Also Read: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ప్రాక్టికల్, థియరీ పరీక్షలు ఎప్పటినుంచంటే?

డేటాను సైబర్ నేరగాళ్లు డార్క్ వెబ్ సైట్‌లో అమ్మకాలకు పెట్టారు. ఆరోగ్య శ్రీ, ధరణి, మీ సేవ, జీహెచ్‌ఎంసీ, ఇతర శాఖలకు చెందిన డేటా లీక్ అయింది.

డేటా చోరీపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పోలీసులు చెబుతున్నారు. డేటా లీక్‌పై పోలీస్ విచారణ ప్రారంభమైంది. డేటా లీక్‌పై పోలీస్ సెక్యూరిటీ వింగ్ ఆరా తీస్తోంది.