×
Ad

మీ వాహనాలపై ప్రెస్‌, పోలీస్‌, అడ్వొకేట్‌ వంటివి రాయించుకుంటున్నారా? మీకే ఈ వార్నింగ్..

కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తూ సమాచార, పౌరసంబంధాల శాఖ ఆదేశాలు జారీ చేసింది

Vehicle Stickers (Image Credit To Original Source)

  • హోదాను తెలిపేలా స్టిక్కర్లు అంటించుకోవద్దు
  • వృత్తిపరమైన పేర్లను రాయించుకుంటే చర్యలు
  • సమాచార, పౌరసంబంధాల శాఖ ఆదేశాలు 

Vehicle Stickers: చాలా మంది తమ వాహనాలపై ప్రెస్‌, పోలీస్‌, అడ్వొకేట్‌ వంటివి రాయించుకుంటారు. ఆయా వృత్తుల్లోలేని వారు కూడా ఇలా వాహనాలకు స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతుంటారు. ఎవరైనా సరే వాహనాలపై తమ హోదాను తెలిపేలా స్టిక్కర్లు అంటించుకోవద్దని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

అనధికారికంగా సర్కారు చిహ్నాలతో పాటు వృత్తిపరమైన పేర్లను రాయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తూ సమాచార, పౌరసంబంధాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. వాహనాలపై అటువంటివి రాసుకోవడం కేంద్ర మోటారు వాహన నిబంధన-1989లోని 50, 51 ప్రకారం విరుద్ధమని చెప్పింది.

Also Read: 2 కంటైనర్లు.. అందులో రూ.400 కోట్ల డబ్బు.. మొత్తం మాయం!

ఈ సందర్భంగా కర్ణాటక హైకోర్టు కొన్ని రోజుల క్రితం ఇచ్చిన తీర్పును కూడా ఉటంకించింది. ఒకవేళ ఇప్పటికే వాహనాల నంబర్‌ ప్లేట్లపై అటువంటి రాతలు, స్టిక్కర్లు ఉంటే తొలగించాలని చెప్పింది. అక్రెడిటేషన్‌ పొందిన జర్నలిస్టులు మాత్రమే తమ వెహికిల్స్‌పై ప్రెస్‌ అనే పదాన్ని రాసుకోవచ్చని పేర్కొంది. గుర్తింపు లేనివారు ప్రెస్‌ అని రాసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పింది.