Telangana Govt: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్​న్యూస్​.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ..

Rajiv Yuva Vikasam Scheme

Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తుల గడువును సర్కార్ పొడిగించింది. ఏప్రిల్ 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చునని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Also Read: LRS Scheme: ఎల్ఆర్ఎస్ గడువు మరో నెల పొడిగింపు..? ఈసారి ఫీజు రాయితీలో కోత..

రాజీవ్ యువవికాసం పథకంపై భట్టి విక్రమార్క ప్రగతి భవన్ నుంచి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ‘‘ ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నిరుద్యోగ యువత సొంతకాళ్లపై నిలబడాలన్న ఆశయంతో ఈ పథకాన్ని చేపట్టామని, మండల పరిషత్, పురపాలక కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో పెట్టాలని, అభ్యర్థులు అక్కడే ధరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేయాలి’ అని అధికారులకు భట్టి విక్రమార్క సూచించారు.

Also Read: Gas Cylinder Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. హైదరాబాద్ లో ఎంత తగ్గిందంటే?

రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం యూనిట్ల విలువ ఆధారంగా రుణాలను మూడు క్యాటగిరీలుగా విభజించిన విషయం తెలిసిందే.
క్యాటగిరీ-1: లక్ష వరకు లోన్ అందిస్తుంది. అందులో 80శాతం రాయితీ ఉంటుంది.
క్యాటగిరీ -2 : లక్ష నుంచి రూ.2లక్షల వరకు లోన్ లను మంజూరు చేస్తుంది. అందులో 70శాతం రాయితీని కల్పిస్తుంది.
క్యాటగిరీ -3: రూ.2లక్షల నుంచి రూ.3లక్షల లోపు రుణాలను అందజేయనుండగా అందులో 60శాతం రాయితీ కల్పిస్తారు.

 

రాజీవ్ యువ వికాసం పథకానికి ఓబీఎంఎంఎస్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత డౌన్ లోడ్ చేసుకున్న అప్లికేషన్ కాపీతోపాటు ఇతర సర్టిఫికెట్లను జతచేసి ఎంపీడీవో, మున్సిపల్ ఆఫీసు వద్ద హెల్ప్ డెస్కుల అందజేయాల్సి ఉంటుంది.