Gas Cylinder Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. హైదరాబాద్ లో ఎంత తగ్గిందంటే?

చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది.

Gas Cylinder Price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర.. హైదరాబాద్ లో ఎంత తగ్గిందంటే?

Gas Cylinder

Updated On : April 1, 2025 / 7:54 AM IST

Gas Cylinder Price: చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. 19కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.41తగ్గిస్తున్నట్లు కేంద్ర చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 1803 నుంచి రూ. 1762కు తగ్గింది. తగ్గించిన ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి.

 

ముంబైలో కమర్షియల్ (19కేజీల) గ్యాస్ సిలిండర్ ధర రూ.1,714.50కి లభిస్తుంది. కోల్ కతాలో రూ.1,872కి చేరుకుంది. చెన్నైలో గతంలో రూ.1,965.50కాగా.. ప్రస్తుతం రూ.1924.50కి చేరుకుంది. హైదరాబాద్ లో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.44 తగ్గింది. దీంతో నిన్నటి వరకు రూ.2,029గా ఉన్న ధర రూ.1,985.50కు తగ్గింది. విశాఖపట్టణంలో 19కేజీల ఎల్పీజీ సిలిండర్ రేటు రూ.44.50 తగ్గింది. దీంతో ప్రస్తుత ధర రూ.1,817కు చేరింది.

 

మరోవైపు 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత సంవత్సరం ఆగస్టు నెల తరువాత వీటి ధరల్లో మార్పు చోటు చేసుకోలేదు.