Fully vaccinated Hyd: హైదరాబాద్‌లో ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్.. తెలంగాణ ప్రభుత్వం ఫోకస్!

హైదరాబాద్ నగరంలో నివసించేవారు అందరికీ పూర్తిగా వ్యాక్సిన్‌లు వేయడానికి తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

Telangana Health Department: హైదరాబాద్ నగరంలో నివసించేవారు అందరికీ పూర్తిగా వ్యాక్సిన్‌లు వేయడానికి తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రతిష్టాత్మకంగా లక్ష్యాన్ని పెట్టుకుని 75 మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్‌ల ద్వారా 100 పిహెచ్‌సిల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచెయ్యాలనే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. డిపార్ట్‌మెంట్‌తో పాటు, జీహెచ్‌ఎంసీ, మెజారిటీ ప్రజలకు వ్యాక్సిన్‌లు వేసేలా కార్యక్రమాన్ని ప్రారంభించింది.

అధికారిక మూలాల ప్రకారం, GHMC పరిమితుల్లో దాదాపు 50లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటివరకు, హైదరాబాద్‌లో 25 లక్షల మందికి మొదటి డోస్‌ వేయగా.., 8.78 లక్షల మంది రెండో డోస్‌ వ్యాక్సిన్‌లు వేశారు. వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించడమే కాకుండా, నిర్దిష్ట ప్రాంతంలో ప్రజలను సేకరించడానికి GHMC సిబ్బంది ఇంటింటికీ వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

దాదాపు 22వేల మంది వ్యక్తులు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే మొబైల్ వ్యాక్సిన్ వ్యాన్‌ల ద్వారా వ్యాక్సిన్లు వేయించుకున్నారు. వ్యాక్సిన్ల కొరత లేదని, ప్రస్తుతం రాష్ట్రంలో 11 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని వైద్యశాఖ అధికారి తెలిపారు. సమీప భవిష్యత్తులో వ్యాక్సిన్‌ల కొరత నివేదికలను తోసిపుచ్చుతూ, 20లక్షల వ్యాక్సిన్‌లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపుతుందని అధికారి వెల్లడించారు.

ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా 1.57 కోట్ల డోస్‌లు ఇవ్వగా.. వీటిలో 1.17కోట్ల ఫస్ట్ డోసును 40 లక్షల మందికి సెకండ్ డోసును ఇచ్చారు. వ్యాక్సిన్లు వేయించుకోవడానికి ఎక్కువ మంది ముందుకు రావట్లేదని, రోజుకు గరిష్టంగా 1నుంచి 1.3 లక్షల డోసులు మాత్రమే వేస్తున్నట్లు అధికారులు సూచించారు. ప్రజలు సమీప వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు