AnganWadi
రాష్ట్రంలోని అంగన్వాడీ ఉపాధ్యాయులు, హెల్పర్ల ఉద్యోగ విరమణ ప్యాకేజీ ఉత్తర్వులను తెలంగాణ సర్కారు జారీ చేసింది. రిటైర్ అయ్యే అంగన్వాడీ టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష చొప్పున అందించనున్నట్లు తెలిపింది. గత జీవోలో ఉపాధ్యాయులకు రూ.లక్ష చొప్పున, హెల్పర్‌కు రూ.50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.
Also Read: టర్మ్ పాలసీ ఎందుకు తీసుకోవాలి? మిగతా వాటి కంటే ఇది ఎందుకు బెటర్?
దీనిపై ప్రభుత్వం ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. ఆ ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఉపాధ్యాయులు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయసును 65 ఏళ్లకు పరిమితం చేసినప్పటికీ, 60 ఏళ్లు నిండిన తర్వాత స్వచ్ఛందంగా రిటైర్మెంట్ తీసుకున్నా ఆర్థిక సాయంలో ఏ మాత్రం కోత ఉండదు. ఈ విషయాన్ని శిశు సం క్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ తాజా ఉత్తర్వుల్లో తెలిపారు.