టర్మ్ పాలసీ ఎందుకు తీసుకోవాలి? మిగతా వాటి కంటే ఇది ఎందుకు బెటర్?

పాలసీ తీసుకున్న ప్రారంభంలోనే టెన్యూర్ నిర్ణయిస్తారు.

టర్మ్ పాలసీ ఎందుకు తీసుకోవాలి? మిగతా వాటి కంటే ఇది ఎందుకు బెటర్?

Updated On : June 1, 2025 / 12:18 PM IST

టర్మ్ లైఫ్ పాలసీతో ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్దిష్ట కాలం (10-30 సంవత్సరాలు) పాటు కవరేజ్ ఇస్తుంది. ఈ కాలంలో పాలసీదారుడు మృతి చెందితే, నామినీకి డెత్ బెనిఫిట్‌ (సమ్ అష్యూర్డ్) చెల్లిస్తారు.

ప్రీమియం స్థిరంగా ఉంటుంది, వయసు పెరిగినా మారదు. వయసు తక్కువగా ఉన్నప్పుడు తీసుకుంటే, ఎక్కువ కవరేజ్ ఉంటుంది. ఫ్యామిలీకి సేఫ్‌టీ ఇస్తుంది. టర్మ్ ప్లాన్ తీసుకోవడంలో ఎన్నో లాభాలు ఉన్నాయి. తక్కువ ప్రీమియం, సమ్ అష్యూర్డ్, లాంగ్ కవరేజ్ పీరియడ్, ఫైనాన్షియల్ టెన్షన్లను తగ్గిస్తుంది. అయితే, నమ్మకమైన ఇన్సూరెన్స్ కంపెనీని ఎంచుకోవాలి.

Also Read: గుడ్‌న్యూస్‌… కేంద్రం కీలక నిర్ణయం… వంట నూనెల ధరలు తగ్గబోతున్నాయి…

టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ సింపుల్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని, దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాలసీహోల్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లించాల్సిన ప్రీమియంను అతడి/ఆమె వయస్సుతో పాటు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, మద్యపానం, ధూమపానం, పాలసీ కవరేజ్, సమ్ అష్యూర్డ్‌‌‌‌‌‌‌‌ లాంటి అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు.

ఈ అమౌంట్, పాలసీ సమయం మొత్తం ఫిక్స్‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది. పాలసీ తీసుకున్న ప్రారంభంలోనే టెన్యూర్ నిర్ణయిస్తారు. ఇది మారకుండా ఉంటుంది. చిన్న వయస్సులోనే ఈ పాలసీ తీసుకోవడం చాలా మంచిది. తక్కువ యసులోనే పాలసీ తీసుకుంటే ప్రీమియం మరింత తగ్గవచ్చు.

అలాగే, అధిక సమ్‌‌‌‌‌‌‌‌ అష్యూర్డ్​‌ అమౌంట్ పొందే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ కంపెనీ మీకు సంబంధించిన ఫ్యూచర్ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ పొటెన్షియల్‌‌‌‌‌‌‌‌ని చూస్తుంది. మీకు ఆరోగ్య సమస్యలు లేకపోతే అధిక అమౌంట్‌‌‌‌‌‌‌‌కి అప్రూవ్ చేస్తుంది. పాలసీ తీసుకునేటప్పుడు మీ ఆదాయం, రుణాలు, భవిష్యత్తులో వచ్చే ఖర్చులను బట్టి సరిపోయే అమౌంట్‌ను సెలెక్ట్ చేసుకోండి. మీ వార్షిక ఆదాయానికి 10-15 రెట్ల మధ్య సమ్ అష్యూర్డ్​‌ తీసుకుంటే మంచిది.