Telangana High court quashes nomination of Kodandaram and Amer Ali Khan as MLCs under Governor’s quota
Governor Quota MLC : తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల కథ మళ్లీ మొదటికి వచ్చింది. హైకోర్టు తీర్పుతో పెద్దల సభలో అడుగు పెట్టే ఎమ్మెల్సీలు ఎవరన్న సస్పెన్స్ మరింత ఎక్కువైంది. బీఆర్‌ఎస్ సర్కార్ నియమించిన ఇద్దరికి చాన్స్ వస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఇద్దరికే పెద్దల సభలో అడుగుపెట్టే భాగ్యం దక్కుతుందా? పొలిటికల్ సర్కిల్స్‌లో ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు ఇదే చర్చ. ఎమ్మెల్సీల నియామక గెజిట్‌ను హైకోర్టు కొట్టివేయడంతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి? పెద్దల సభ ప్రొసీజర్‌పై రకరకాల చర్చలు కొనసాగతున్నాయి… మరి వాట్ నెక్ట్స్…? ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి..?
ఎమ్మెల్సీ గెజిట్‌ను రద్దు చేసిన హైకోర్టు :
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు ఎవరు? బీఆర్‌ఎస్ సర్కార్ సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ప్రస్తుత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందా? లేక తాను నామినేట్ చేసిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ పేర్లనే మరోసారి పంపుతుందా? తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన అంశమిదే… ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ విడుదల చేసిన గెజిట్‌ను హైకోర్టు రద్దు చేయడంతోపాటు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయమని సూచించడంతో ఎమ్మెల్సీ పదవులపై సస్పెన్స్ పెరిగిపోతోంది.
మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం :
గత ప్రభుత్వంలో శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ అప్పటి కేబినెట్ చేసిన సిఫార్సులను గవర్నర్ తిరస్కరించడంపై కోర్టు తీర్పును అనుసరించి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే కొత్త నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కేబినెట్ తీర్మానం ఎలా ఉండబోతుంది.. మళ్లీ ఏ ఇద్దరిని పరిగణనలోకి తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది..
కోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ గతంలో రిజక్ట్ చేసిన దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను పరిగణలోకి తీసుకుంటారా? లేదా? అనే చర్చ కూడా నడుస్తోంది.. పిటిషనర్ల వాదన ప్రకారం… తమ అర్హతలపై అనుమానాలను పునఃపరీశీలించాల్సి వున్నందున.. మళ్లీ తమ పేర్లనే సూచించాలని అంటున్నారు. ఎందుకంటే గతంలోనే కేబినెట్ నిర్ణయం జరిగిపోయింది కాబట్టి.. మళ్లీ నిర్ణయం తీసుకోవాల్సిన అసవరం లేదన్న వాదనగా వినిపిస్తున్నారు.
ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం :
అయితే ప్రభుత్వం మారినందున గత ప్రభుత్వ నిర్ణయాలను పాటిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వ నిర్ణయాలను పాటించాలనే రూల్ లేనందున… ప్రస్తుత ప్రభుత్వం సిఫార్సు చేసిన ప్రొఫెసర్ కోదండరాం, అమీర్అలీ పేర్లనే మళ్లీ పంపించే చాన్స్ ఉందనేది పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న చర్చ.. దీనిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందనేది ప్రభుత్వ పెద్దల వెర్షన్..
మొత్తానికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకాలపై హైకోర్టు తీర్పుతో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది… కోర్టు జోక్యం వల్ల మళ్లీ న్యాయపరమైన చిక్కుముడులు లేకుండా జాగ్రత్తగా వ్యవహరించేందుకు ప్రభుత్వం కొద్దిగా సమయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. అంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాతే పెద్దల సభ పంచాయితీ తెరపైకి వస్తుందని… అంతవరకు పెద్దలంతా రెస్టు తీసుకోవడమేనంటున్నారు పరిశీలకులు.
Read Also : YCP 11th List : వైసీపీ 11వ జాబితా విడుదల.. కర్నూలు వైసీపీ పార్లమెంట్ ఇంచార్జ్‌గా బి.వై. రామయ్య