YCP 11th List : వైసీపీ 11వ జాబితా విడుదల.. కర్నూలు వైసీపీ పార్లమెంట్ ఇంచార్జ్‌గా బి.వై. రామయ్య
వైసీపీ అధిష్టానం శుక్రవారం (మార్చి 8న) పదకొండవ జాబితాను రిలీజ్ చేసింది. అందులో రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాను ప్రకటించింది.

ysrcp 11th list released Today
YCP 11th List : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌ల నియామకానికి సంబంధించి మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధిష్టానం మొత్తం 10 జాబితాలను విడుదల చేయగా.. తాజాగా శుక్రవారం (మార్చి 8న) పదకొండవ జాబితాను రిలీజ్ చేసింది.

ysrcp 11th list released
అందులో రెండు పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ జాబితాను ప్రకటించింది. ఈసారి జాబితాలో ప్రధానంగా కర్నూలు ఎంపీ ఉత్కంఠకు వైసీపీ తెరతీసింది.
వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేసింది. కర్నూలు వైసీపీ పార్లమెంట్ ఇంచార్జ్ గా మేయర్ బి.వై. రామయ్యను నియమించింది. వాల్మీకి సామాజిక వర్గానికే ఈసారి కూడా వైసీపీ సీటును కేటాయించింది.
అమలాపురం పార్లమెంట్ ఇన్‌చార్జ్‌గా రాపాక వరప్రసాద్‌ను నియమించగా, రాజోలు అసెంబ్లీ ఇన్‌చార్జ్‌గా గొల్లపల్లి సూర్యారావుకు అవకాశం ఇచ్చింది. ఇప్పటివరకూ విడుదల చేసిన 11 జాబితాల్లో 73 అసెంబ్లీ స్థానాలు, 23 పార్లమెంట్ ఇన్‌ఛార్జ్‌ల జాబితాలను వైసీపీ అధిష్టానం విడుదల చేసింది.