Six Private Hospitals
Six Private Hospitals Licence : మరికొన్ని ప్రైవేటు ఆస్పత్రులపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ కొరడా ఝళిపించింది. ఆరు ఆస్పత్రులపై చర్యలు తీసుకుంది. ఆస్పత్రుల లైసెన్స్‌ను వైద్యారోగ్య శాఖ రద్దు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నందుకు ఆయా ఆస్పత్రులపై కొరడా ఝులిపించింది.
సికింద్రాబాద్ కిమ్స్, గచ్చిబౌలిలోని సన్‌షైన్ ఆస్పత్రిపై చర్యలు తీసుకుంది. అలాగే బంజారాహిల్స్‌లోని సెంచరీ, లక్డీకపూల్‌లోని లోటస్ ఆసుపత్రి, ఎల్బీనగర్‌లోని మెడిసిస్, టోలీచౌకిలోని ఇంటిగ్రో ఆస్పత్రులు ఉన్నాయి.
ఇప్పటివరకు రాష్ట్రంలో 22 ఆస్పత్రులపై కొవిడ్ ట్రీట్‌మెంట్ రద్దు చేసింది. ఇప్పటివరకు 113 ఆస్పత్రులకు వైద్యారోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.