High Court - Srinivas Goud
High Court – Srinivas Goud : తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి ఊరట లభించింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. పిటిషన్ కొట్టివేస్తూ ఈ మేరకు హైకోర్టు తీర్పు ఇచ్చింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికను సవాల్ చేస్తూ మహబూబ్ నగర్ వాసి వేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు 2019లో పిటిషన్ దాఖలు చేశారు.
ఆస్తులు, అప్పుల వివరాలు ఎన్నికల అఫిడవిట్ లో ప్రకటించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఎన్నికల అఫిడవిట్ లో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు వివరాలు పేర్కొన్నారని రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనివాస్ గౌడ్ కు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగే అర్హత లేదని పిటిషన్ లో పేర్కొన్నారు.
Telangana : తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ, కేంద్రమంత్రుల వరుస పర్యటనలు..
అయితే తనపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ జరిపిన ధర్మాసనం శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో శ్రీనివాస్ గౌడ్ కు ఊరట లభించింది.