Telangana : తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ, కేంద్రమంత్రుల వరుస పర్యటనలు..

ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన క్రమంలో దూకుడు పెంచిన బీజేపీ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగానే బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు అమిత్ షా.. ఆ తరువాత వరుసగా కేంద్ర మంత్రుల పర్యటనలతో తెలంగాణ రాజకీయం హాట్ హాట్ గా మారింది.

Telangana : తెలంగాణలో దూకుడు పెంచిన బీజేపీ, కేంద్రమంత్రుల వరుస పర్యటనలు..

Union Ministers visits in Telangana

Updated On : October 10, 2023 / 2:10 PM IST

BJP Focus on Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. అన్ని పార్టీల నేతలంతా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అధికార పక్షంపై ప్రతి పక్షాలు..ప్రతిపక్షాలపై అధికార పక్షం విమర్శనాస్త్రాలు ఎక్కు పెట్టేందుకు రెడీ అవుతున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణపై కన్నేసిన బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగానే తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు క్యూ కట్టారు. అలాగే కేంద్ర మంత్రులు కూడా తెలంగాణకు క్యూకట్టారు. దీంట్లో భాగంగా మంగళవారం (అక్టోబర్ 10,2023)న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు అంతా రాష్ట్రంలోనే గడపనున్నారు. బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్య నేతలతో సమావేశమై..ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.

ఎన్నికల షెడ్యుల్ ప్రకటించిన క్రమంలో దూకుడు పెంచిన బీజేపీ తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగానే పలువురు బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ఈరోజు అమిత్ షా పర్యటన జరుగనుంది. అలాగే తేదీల వారీగా పలువురు కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు.

అక్టోబర్ 10న అమిత్ షా పర్యటన..
14న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
15న ముషీరాబాద్ లో సాద్వి నిరంజన్ జ్యోతి పర్యటన
16న హుజురాబాద్, మహేశ్వరంలో రాజ్ నాథ్ సింగ్
19న మధిరలో కేంద్ర మత్రి నారాయణ స్వామి

ఇలా బీజేపీ అగ్రనేతలంతా తెలంగాణలో పర్యటించి సభలు, సమావేశాల్లో పాల్గొననున్నారు. తెలంగాణలో అధికారం కోసం పట్టుదలతో ఉన్న బీజేపీ ఆ దిశగా తెలంగాణలో ఫోకస్ పెట్టింది. దీంట్లో భాగంగా బీజేపీ పెద్దలు తెలంగాణకు క్యూ కట్టి ప్రచారాల్లోనూ పాల్గొననున్నారని సమాచారం.

ఇక బీజేపీ అధిష్టానం డైరెక్షన్ లో రాష్ట్రంలో నేతలు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ బైక్ ర్యాలీలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. అదే సమయంలో కేంద్ర మంత్రుల వరుస పర్యటనలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగనున్నాయి. రాష్ట్రంలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో కేంద్రమంత్రులు పర్యటిస్తారని, ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు రాత్రులు గడుపుతారని, పగటిపూట నియోజకవర్గ నాయకులు, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని తెలంగాణ బీజేపీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణలో ఈరోజు అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఇలా..

ఇలా ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ అగ్రనేతలు కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ఇక పోతే అధికార బీఆర్ఎస్ కూడా దూకుడు పెంచింది. కేసీఆర్ రంగంలోకి దిగి సభల్లో తనదైన శైలిలో ప్రసంగించనున్నారు. దీని కోసం ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయ్యింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సీఈసీ షెడ్యూల్ విడుదల చేసిన క్షణం నుంచి అన్ని పార్టీలు దూకుడు పెంచాయి.

రాష్ట్రంలో ఒకే విడతలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు ఎన్నికల రణరంగంలోకి దూకేందుకు సిద్ధమయ్యాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల రణరంగంలోకి దిగింది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గాల వారిగా అభ్యర్థులనుసైతం ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 15నుంచి మొదలుపెట్టి ఎన్నికల ప్రచార పర్వం పూర్తయ్యే వరకు కేసీఆర్ ప్రజల్లో ఉండనున్నారు. నియోజకవర్గాల వారిగా వరుసగా సభలతో పాటు, పలు జిల్లాల్లో భారీ బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.

మరోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చి ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోను నష్టపోయిన కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావాలనే యత్నం..ఇక బీజేపీ కూడా తెలంగాణలో అధికారం కోసం పట్టుదలగా ఉంది. ఇలా మూడు పార్టీల మధ్యా హోరా హోరీ పోటీ జరుగనుంది. దీంతో తెలంగాణ అంతా రాజకీయ కాకమీదుంది.