ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ నమోదుపై హైకోర్టు స్టే..

  • Publish Date - November 3, 2020 / 02:00 PM IST

dharani portal : ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ నమోదుపై హైకోర్టు స్టే విధించింది. ధరణి పోర్టల్ లో భద్రతాపరమైన అంశాలపై దాఖలైన మూడు పిటిషన్లను తెలంగాణ హైకోర్టు విచారించింది.



నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలు నమోదు చేయొద్దని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్ లో ధరణి పోర్టల్‌ను పోలిన 4 యాప్స్ ఉన్నాయని అభిప్రాయపడింది. దీంతో అసలైన ధరణి పోర్టల్ ఏదన్నదానిపై ప్రజల్లో అనుమానాలున్నాయని తెలిపింది.



ఎలాంటి భద్రత పరమైన చర్యలు తీసుకుంటున్నారో 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.