Mahmood Ali : గన్‌మెన్‌ చెంప ఛెళ్లుమనిపించిన తెలంగాణ హోంమంత్రి

తెలంగాణ హోమ్ శాఖా మంత్రి మహమూద్ అలీ సహనం కోల్పోయారు. సెక్యురిటీ గార్డ్ పై చేయి చేసుకున్నారు.

Mahmood Ali Slapped Gunman

Telangana Minister Mahmood Ali : తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీ సహనం కోల్పోయారు. సెక్యురిటీ గార్డ్ పై చేయి చేసుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆయన సెక్యురిటీ గార్డ్ పై చేయి చేసుకున్నారు. తలసానికి పుట్టిన రోజు వేడుకలకు హాజరైన మహమూద్ ఆలీ.. శుభాకాంక్షలు తెలియజేశారు.

మంత్రిని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. తరువాత అక్కడున్న సెక్యురిటీ గార్డ్  తలసానికి ఇచ్చేందుకు ఫ్లవర్ బొకే ఏది అని అడిగారు. ఈ క్రమంలోనే అతను తెలీదని చెప్పినట్లుగా కనిపిస్తోంది. దీంతో సహనం కోల్పోయిన  మహమూద్ ఆలీ… అగ్రహం వ్యక్తం చేస్తు అతని చెంప చెళ్లుమనిపించారు. దీంతో అతను నిస్సహాయంగా చూస్తుండిపోయారు. వెనుక ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి బొకే తీసుకుని మంత్రికి అందించారు.

Also Read: ఏపీలో జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా : కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

కాగా, మంత్రి మహమూద్ అలీ మృదుస్వభావి అని మైక్ లో చెబుతున్నప్పుడే ఆయన తన వ్యక్తిగత సెక్యురిటీ సిబ్బందిపై దాడి చేయడం గమనార్హం. ఈ దృశ్యాన్ని చూసిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. మహమూద్ అలీని నవ్వుతూనే ఆలింగనం చేసుకుని సముదాయించారు. మంత్రి మహమూద్ అలీ చేతివాటం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజనులు మంత్రి వ్యవహార శైలిపై విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి అహంకారపూరితంగా వ్యవహరించారని, గన్‌మెన్‌ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.