Telangana Inter Exams Representative Image (Image Credit To Original Source)
Telangana Inter Board: ఇంటర్ ఎగ్జామ్స్ కు సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఇంటర్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్ల ప్రివ్యూ లింక్‌ను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నెంబర్లకు పంపించనుంది. ఫస్టియర్ విద్యార్థులు.. SSC రోల్ నెంబర్, డేటాఫ్ బర్త్ తో.. సెకండియర్ విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ హాల్ టికెట్ నెంబర్, డేటాఫ్ బర్త్ తో ప్రివ్యూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ప్రివ్యూలో పాస్/ఫెయిల్ వివరాలు, పరీక్ష షెడ్యూల్ కూడా అందుబాటులో ఉంటుంది. వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే కాలేజీ ప్రిన్సిపల్ లేదా DIEOలకు తెలియజేయాలని ఇంటర్ బోర్డు సూచించింది.
”ఫిబ్రవరి 25 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో 45 రోజుల ముందుగానే తల్లిదండ్రుల వాట్సప్ నెంబర్లకు వారి పిల్లల హాల్ టికెట్లను పంపిస్తాం. హాల్ టికెట్ నెంబర్, ఎగ్జామ్ సెంటర్ చిరునామాతో పాటు ఏ రోజు ఏ పరీక్ష అనే వివరాలు విద్యార్థుల పేరెంట్స్ కు తెలియ చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. విద్యార్థులకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. హాల్ టికెట్‌లో తప్పొప్పులను ముందే గుర్తించే అవకాశం కూడా ఉంటుంది” అని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. ”సెకండియర్ హాల్ టికెట్ లో ఫస్టియర్ మార్కుల లింక్ కూడా ఇస్తాం. దీంతో తమ పిల్లల చదువుకు సంబంధించి తల్లిదండ్రులకు ఒక అంచనా ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి” అని అధికారులు అభిప్రాయపడ్డారు.
Telangana Inter Board Representative Image (Image Credit To Original Source)
టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఫస్టియర్ హాల్ టికెట్ వివరాలను చూడొచ్చని బోర్డు తెలిపింది. ఇక, హాల్ టికెట్‌లో వివరాలను పేరెంట్స్ బాగా పరిశీలన చేయాలని, అందులో ఏమైనా తప్పులుంటే కాలేజీలను సంప్రదింవచ్చని ఇంటర్ బోర్డు సూచించింది. లేదా నోడల్ అధికారులను కూడా కలవొచ్చంది.
Also Read: వావ్.. రూ.2.5 కోట్ల ప్యాకేజీ.. చరిత్ర సృష్టించిన 21ఏళ్ల హైదరాబాద్ కుర్రాడు