Junior Doctors : తెలంగాణ జూ.డాక్టర్లు సమ్మె సైరన్!
తమ స్టైఫండ్ విడుదలలో కూడా జాప్యం జరుగుతోందన్నారు. నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. ఏళ్లు గడుస్తున్నా కూడా స్టైఫండ్ పెంపు లేకపోవడంపై అసంతప్తి వ్యక్తం చేశారు.

Junior Doctors
Junior Doctors : తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను, డిమాండ్లను రేపటిలోగా పరిష్కరించాలని.. లేకపోతే ఏప్రిల్ 11వ తేదీ నుంచి సమ్మె చేస్తామని ప్రకటించారు. మంగళవారం నుంచి అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని డాక్టర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. తమ స్టైఫండ్ విడుదలలో కూడా జాప్యం జరుగుతోందన్నారు.
నెలల తరబడి నిధులు విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. ఏళ్లు గడుస్తున్నా కూడా స్టైఫండ్ పెంపు లేకపోవడంపై అసంతప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే డిమాండ్ల సాధన కోసవ తాము సమ్మె చేయనున్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. గతంలో కూడా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన సందర్భాలు ఉన్నాయి.
married couple protest : పోలీస్ స్టేషన్ వద్ద పెళ్లి జంట ఆందోళన.. కారణం తెలిస్తే షాకవుతారు
తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే అప్పటివరకు సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పడంతో సమ్మె విరమించి తిరిగి విధులకు హాజరయ్యారు. సమస్యల పరిష్కారం కోసం తాజాగా మరోసారి జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు.