married couple protest : పోలీస్ స్టేషన్ వద్ద పెళ్లి జంట ఆందోళన.. కారణం తెలిస్తే షాకవుతారు
కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా వధూవరులిద్దరూ పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఇరు కుటుంబాల మధ్య ఏదైనా తగవులాట జరిగిందేమో అని అందరూ అనుకున్నారు. కట్ చేస్తే కారణం అది కానే కాదు. వారి సమస్య పోలీసులు పరిష్కరించారా? లేదా?

married couple protest
married couple protest : మరికొన్ని గంటల్లో పెళ్లి చేసుకోవాల్సిన జంట కాస్త పోలీస్ స్టేషన్ (police station) మెట్లెక్కింది. పోలీసులు తమ సమస్య పరిష్కరిస్తే కానీ వివాహానికి ససేమిరా అన్నారు. ఇద్దరి మధ్యా ఏదో గొడవ జరిగిందని ఊహిస్తున్నారు కదా.. కానే కాదు. వివరం తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.
Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య రచ్చ.. పెప్పర్ స్ప్రే ప్రయోగించిన మహిళ వీడియో వైరల్
మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) రత్లాం జిల్లాలో (Ratlam) ఓ వివాహ వేడుక గ్రాండ్‌గా మొదలైంది. అందరూ సందడి చేస్తున్నారు. ఓ వైపు పెద్దగా డీజే (DJ) మ్యూజిక్ అదిరిపోతోంది. అప్పుడే పోలీసులు వచ్చారు. వెంటనే DJ ఆపమని చెప్పారు. పెళ్లివారు వినలేదేమో పోలీసులు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయారు. ఇక పెళ్లి చేసుకోవాల్సిన జంట పోలీస్ స్టేషన్ కి వెళ్లింది. పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు (protest) దిగింది. పోలీసులు పెళ్లి మండపం దగ్గర తమవారితో అనుచితంగా ప్రవర్తించారని.. పెళ్లి పందిరిలో నానా హంగామా చేశారని పెళ్లిజంట ఆరోపించారు.
పోలీసుల చర్యలు తీసుకునే వరకు తాము పెళ్లి చేసుకోబోమని ఆ జంట పోలీస్ స్టేషన్ ఎదుట 3 గంటల పాటు నిరసన తెలిపారు. చివరికి పోలీసులు వారికి సర్ది చెప్పి హామీ ఇవ్వడంతో పెళ్లిజంట పెళ్లి చేసుకోవడానికి వేదిక వద్దకు చేరుకున్నారు. మొత్తానికి పోలీసుల వల్ల ఆగిపోయిన పెళ్లి జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.