ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకంటే ముందున్నాం: గ్లోబల్ సమిట్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
మహిళా రైతులను అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నామని జిష్ణుదేవ్ వర్మ తెలిపారు.
Jishnu Dev Varma
Jishnu Dev Varma: ‘తెలంగాణ రైజింగ్’ పేరిట సీఎం రేవంత్ రెడ్డి సర్కారు నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ కొనసాగుతోంది. ఈ సదస్సును తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు. ఆవిష్కరణల్లో అన్ని రాష్ట్రాలకంటే ముందున్నామని ఆయన చెప్పారు. నిర్ణీత లక్ష్యాలు నిర్దేశించుకొని తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తందని అన్నారు. 2047లోగా తెలంగాణ మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. (Jishnu Dev Varma)
మహిళా రైతులను అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నామని జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. 66 బస్సుల నిర్వహణను కూడా మహిళా సంఘాలకు ఇచ్చామని చెప్పారు.
Also Read: IAS Amrapali: ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా తెలంగాణ వేగంగా అడుగులు వేస్తోందని జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. తెలంగాణలో స్థిరమైన, పారదర్శక ప్రభుత్వం ఉందని చెప్పారు.
కాగా, రాష్ట్రంలో ట్రంప్ మీడియా టెక్నాలజీస్ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. వచ్చే 10 ఏళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఎరిక్ ప్రకటించారు.
రాష్ట్ర విజన్‌లో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నామని సీఐఐ మాజీ ఛైర్మన్ దినేశ్ చెప్పారు. రాష్ట్ర విజన్‌ను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తోందని అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు.
