TS Covid Update : తెలంగాణలో కొత్తగా 315 కోవిడ్ కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 315 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,866 కి చేరింది.
- chvmurthy
- Published On : September 13, 2021 / 09:24 PM IST
Telangana Covid Cases
TS Covid Update : తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 315 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,61,866 కి చేరింది. అదే సమయంలో మరో 318 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్ తదితర వ్యాధుల నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,52,716 కి చేరింది.
Read Also : AP Covid Report : ఏపీలో కొత్తగా 864 కోవిడ్ కేసులు
24 గంటల వ్యవధిలో కోవిడ్ బారిన పడి ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 3,897కి చేరింది, ప్రస్తుతం రాష్ట్రంలో 5,253 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది.
Read Also : Man Cheated Girl : తనను వదిలేసి వెళ్లిన మొగుడ్ని చొక్కా పుచ్చుకు లాక్కెళ్ళిన భార్య
కాగా రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 98.61 శాతానికి చేరుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో 75, కరీంనగర్ జిల్లాలో 29, ఖమ్మంలో 23, మేడ్చల్ మల్కాజ్ గిరి, పెద్దపల్లిలో 19 చొప్పున, వరంగల్ అర్బన్ లో 17 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
