AP Covid Report : ఏపీలో కొత్తగా 864 కోవిడ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 864 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసులు సంఖ్య 20,30,849 కి చేరింది.

Ap Covid Cases Update
AP Covid Report : ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 864 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసులు సంఖ్య 20,30,849 కి చేరింది. ఈ రోజు ఉదయం వరకు మరో 1,310 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 20,02,187 మంది వ్యాధినుంచి కోలుకున్నారు.
Read Also : UP : గర్భిణీ భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన భర్త, పెళ్లయి..9 నెలలే
గడచిన 24 గంటల్లో 12 మంది మరణించటంతో, కోవిడ్, తదితర సమస్యలతో ఇంతవరకు మరణించిన వారి సంఖ్య రాష్ట్రంలో 14,010 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,652 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,73,63,641 శాంపిల్స్ పరీక్షించటం జరిగిందని రాష్ఠ్ర ప్రభుత్వం తెలిపింది.

Ap Covid Report