UP : గర్భిణీ భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన భర్త, పెళ్లయి..9 నెలలే

విడాకులు కావాలంటూ..భార్యకు హెచ్ఐవీ రోగికి ఉపయోగించిన సూదీని ఇచ్చాడు. విడాకులు కావాలంటూ..విచక్షణారహితంగా ప్రవర్తించాడు.

UP : గర్భిణీ భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన భర్త, పెళ్లయి..9 నెలలే

Up

Hiv Injection : దంపతుల మధ్య గొడవలు, ఘర్షణలు జరగడం సర్వసాధారణం. కొంతమంది విడాకులు తీసుకోవాలని భావించి..కోర్టులను ఆశ్రయిస్తుంటారు. కానీ..ఓ భర్త మాత్రం విడాకులు కావాలంటూ..భార్యకు హెచ్ఐవీ రోగికి ఉపయోగించిన సూదీని ఇచ్చాడు. విడాకులు కావాలంటూ..విచక్షణారహితంగా ప్రవర్తించాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Third Wave : థర్డ్ వేవ్ రాదు.. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ షురూ

మహేశ్ గౌతమ్ ఆలీగఢ్ లోని ఓ ఆసుపత్రిలో ల్యాబ్ లో కాంట్రాక్టు టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. గత సంవత్సరం డిసెంబర్ లో ఓ యువతితో వివాహం జరిగింది. అయితే..ఆసుపత్రిలో పనిచేస్తున్న సహోద్యోగితో మహేశ్ కు అక్రమ సంబంధం ఉందని..కొన్నాళ్ల క్రితం భార్యకు తెలిసింది. ఈ విషయంపై మహేశ్ ను నిలదీయడం ప్రారంభించింది. అక్రమ సంబంధ విషయం తెలియడంతో తనకు విడాకులు ఇవ్వాలంటూ…వేధించడం ప్రారంభించాడు. దీనికి భార్య నో చెబుతూ వస్తోంది.

Read More : Organ Donation: మరణం తర్వాత జీవించే గొప్పదానం..8మందికి కొత్త జీవితమిచ్చే మహద్భాగ్యం

ఈ క్రమంలో..ఓ వ్యక్తికి ఇచ్చిన హెచ్ఐవీ (HIV) సూదీతో తన భార్యకు ఇంజక్షన్ చేశాడు. ఈ విషయాన్ని తండ్రి తెలియచేసింది యువతి. ఆయన పోలీసులు ఆశ్రయించారు. తను గర్భవతి అని తెలిసినప్పటి నుంచి భర్త తనకు హెచ్ఐవీ అంటించేందుకు ప్రయత్నిస్తున్నాడని వెల్లడించారు. తన కుమార్తె అత్తామామలతో పాటు…ఆస్పత్రి యజమాని ఈ కుట్రలో భాగస్వాములని తండ్రి ఆరోపించారు. దీంతో మహేశ్ గౌతమ్, అతడి తల్లిదండ్రులు, ఆసుపత్రి యాజమాన్యంపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.