Paddy (1)
Telangana Paddy : ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ మంత్రులకు కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. 2022, మార్చి 24వ తేదీ గురువారం ఉదయం 11 గంటల 45 నిముషాలకు కేంద్రమంత్రితో తెలంగాణ మంత్రులు భేటి కానున్నారు. యాసంగి ధాన్యం మొత్తం కొనాలంటూ కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. అయితే తెలంగాణలో ధాన్యం, బియ్యాన్ని కొనడానికి అపార అవకాశాలు ఉన్నాయని పీయూష్ గోయెల్ చెప్పినట్లు సమాచారం.
Read More : Paddy Procurement : ధాన్యం కొనుగోళ్ల విషయంలో టి.సర్కార్‌కు కేంద్రం షాక్
మరోవైపు తెలంగాణలో ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న విమర్శలకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. ధాన్యం, బియ్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు. అదనంగా ఉన్న ఉత్పత్తుల డిమాండ్, సరఫరా ఆధారంగానే కొనుగోలు ఉంటాయని స్పష్టం చేశారు. అస్సాంలో ధాన్యం సేకరణపై.. లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
Read More : Telangana Paddy Issue : ధాన్యం దంగల్.. కేంద్ర మంత్రితో భేటీ కానున్న టీఆర్ఎస్ ఎంపీలు
ధాన్యం సేకరణ కేవలం ఉత్పత్తి పైనే ఆధారపడి ఉండదని.. మద్దతు ధర, డిమాండ్, సప్లై లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని టీఆర్‌ఎస్ కోరనుంది. కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే.. భవిష్యత్ కార్యాచరణకు అనుగుణంగా ముందుకు వెళ్తామంటున్నారు. రైతుల కోసం ఎలాంటి పోరాటానికి అయినా సిద్ధమని, కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటామని హస్తిన బాటపట్టారు మంత్రులు.