తెలంగాణ ఫైనల్ రిజల్ట్స్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే..

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఒక్క..

Election Results 2024 : తెలంగాణ లోక్ సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఫైనల్ ఫిగర్స్ వచ్చేశాయి. మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గాను అధికార కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు గెలిచింది. ఇక బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది. ఎంఐఎం ఒక సీటు కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు.. పార్లమెంట్ ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు.

కాంగ్రెస్ గెలిచిన సీట్లు..
పెద్దపల్లి – గడ్డం వంశీ
జహీరాబాద్ – సురేశ్ షట్కార్
నాగర్ కర్నూల్ – మల్లురవి
నల్గొండ – రఘువీర్ కుందూరు
భువనగిరి – చామల కిరణ్ కుమార్ రెడ్డి
వరంగల్ – కడియం కావ్య
మహబూబాబాద్ – బలరామ్ నాయక్
ఖమ్మం – రామసహాయం రఘురామ్ రెడ్డి

బీజేపీ గెలిచిన స్థానాలు..
ఆదిలాబాద్ – నగేశ్
కరీంనగర్ – బండి సంజయ్
నిజామాబాద్ – అరవింద్ ధర్మపురి
మెదక్ – రఘునందన్ రావ్
మల్కాజ్ గిరి – ఈటల రాజేందర్
సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి
మహబూబ్ నగర్ – డీకే అరుణ

ఎంఐఎం..
హైదరాబాద్ – అసదుద్దీన్ ఓవైసీ

ప్రజల మద్దతు మాకే- ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్
ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. 8 ఎంపీ, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ ను గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు సీఎం రేవంత్. ప్రజల మద్దతు తమకే ఉందని ఈ ఫలితాలతో రుజువైందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. 100 రోజుల కాంగ్రెస్ పాలనను ఆశీర్వదించి తమ ఆత్మస్థైర్యాన్ని పెంచారని చెప్పారు. మరింత సమర్థవంతమైన పాలన అందించడానికి ఉత్సాహాన్ని ఇచ్చారని సీఎం అన్నారు. కోడ్ ముగిసిన వెంటనే.. మళ్లీ ప్రజా ప్రభుత్వం మొదలవుతుందని సీఎం రేవంత్ చెప్పారు.

Also Read : సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. సొంత నియోజకవర్గంలో బీజేపీ గెలుపు

ట్రెండింగ్ వార్తలు