సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్.. సొంత నియోజకవర్గంలో బీజేపీ గెలుపు
సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా అయిన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ చందర్ రెడ్డిపై డీకే అరుణ 3,410 ఓట్ల మెజార్టీ విజయం సాధించారు.

CM Revanth Reddy
CM Revanth Reddy : తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ కొనసాగుతుంది. తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలు ఉండగా.. ఎనిమిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు విజయం సాధించారు. ఐదు నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధించగా.. మరో మూడు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. హైదరాబాద్ నియోజకవర్గంలో ఎప్పటిలాగానే ఎంఐఎం పార్టీ అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు.
Also Read : కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు సంబరాలు.. కేక్ కట్ చేసి తినిపించిన దేవాన్ష్
సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా అయిన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి వంశీ చందర్ రెడ్డిపై డీకే అరుణ 3,410 ఓట్ల మెజార్టీ విజయం సాధించారు. మహబూబ్ నగర్ సొంత నియోజకవర్గం కావటంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటనలో మహబూబ్ నగర్ నుంచి వంశీ చందర్ రెడ్డినే తొలి అభ్యర్ధిగా ప్రకటించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభం నుంచి రేవంత్ రెడ్డి అత్యధికసార్లు ఆ నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహించి వంశీ చందర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయినా మహబూబ్ నగర్ ప్రజలు డీకే అరుణకే మద్దతు నిలిచారు.
Also Read : శతాబ్దాల హిందువుల కల అయోధ్య రామమందిరం.. కల నెరవేరినా బీజేపీకి మాత్రం..
బీజేపీ అభ్యర్ధి డీకే అరుణ విజయం సాధించినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతోనే విజయం సాధించడం గమనార్హం. మరోవైపు తెలంగాణలో 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క నియోజకవర్గంలోనూ విజయం సాధించలేక పోయింది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చే విషయం అయినప్పటికీ.. 10 నుంచి 14 స్థానాల్లో విజయం సాధిస్తామని భావించిన కాంగ్రెస్ కేవలం ఎనిమిది స్థానాలకే పరిమితం కావటం.. బీజేపీ అనూహ్యంగా పుంజుకొని అధికార కాంగ్రెస్ పార్టీకి పోటీగా నిలుస్తూ ఎనిమిది నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయ సాధించడం కాంగ్రెస్ పార్టీకి కాస్త ఇబ్బందికర విషయమని చెప్పొచ్చు.