శతాబ్దాల హిందువుల కల అయోధ్య రామమందిరం.. కల నెరవేరినా బీజేపీకి మాత్రం..
Ram Temple: సీన్ రివర్స్ అయింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గట్టి సవాలును..

లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌పై దేశంలోని ప్రధాన పార్టీలు ప్రత్యేక దృష్టి పెడతాయి. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేనన్ని సీట్లు యూపీలో ఉంటాయి. ఆ రాష్ట్రంలోని 80 సీట్లలో వీలైనన్ని ఎక్కువగా గెలిస్తే దేశంలో సత్తా చాటొచ్చని భావిస్తాయి.
అటువంటి యూపీలో ఆధిక్యత సాధించాలని బీజేపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసింది. అన్నింటి కన్నా ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని అయోధ్యలో రామమంది నిర్మాణం బీజేపీని ఎన్నడూ లేనన్ని సీట్లు తెచ్చిపెడుతుందని అందరూ భావించారు. శతాబ్దాల హిందువుల కల అయోధ్య రామమందిరం.
ఆ కల నెరవేరినా, యూపీలోని హిందువులు సంబరాల్లో మునిగి తేలినా బీజేపీకి ఓట్లు రాబట్టడంలో మాత్రం ఆ వ్యూహం పనిచేయలేదు. సీన్ రివర్స్ అయింది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గట్టి సవాలును ఎదుర్కొంటోంది.
సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ‘భారత కూటమి’ 44 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఎన్డీఏ మాత్రం 35 స్థానాల్లోనే ప్రభావం చూపగలిగింది. 2014, 2019 ఎన్నికల్లో ఏకంగా 71, 62 స్థానాలతో సత్తాచాటిన ఎన్డీఏ ఈ సారి రామమందిరాన్ని నిర్మించిన ఘనత ఉన్నప్పటికీ గతంలో కంటే చాలా తక్కువ స్థానాల్లో గెలుస్తుండడం గమనార్హం.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో రామమందిరం అంశం నిర్ణయాత్మకంగా మారుతుందని బీజేపీ అనుకుంది. 1980 దశకం నుంచి బీజేపీ ఎన్నికల్లో ఆ అంశంపై హామీలు ఇస్తూనే ఉంది. చివరకు అయోధ్యలో రామ మందిర నిర్మాణ కల ప్రధాని మోదీ హయాంలో నెరవేరింది. దీంతో ఈ సారి బీజేపీకి 75 స్థానాలకు మించి వచ్చినా ఆశ్చర్యం లేదని బీజేపీ మద్దతుదారులు భావించారు.
యూపీలోనే కాదు దేశం మొత్తం రామమందిర నిర్మాణ ప్రభావం ఉంటుందని అనుకున్నారు. దేశంలోనూ ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజారిటీ బీజేపీకి రాలేదు. సమాజ్ వాదీ పార్టీకి చెందిన అఖిలేశ్ యాదవ్ ‘యూపీ బిడ్డ’ అనే నినాదమే బాగా ప్రభావం చూపింది. ఇక యూపీలో మాయావతికి చెందిన బీఎస్పీ ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోతోంది.
Also Read : రాహుల్ గాంధీ చేతిలో ఓటమిని అంగీకరించిన బీజేపీ అభ్యర్థి.. రాయ్‌బరేలి ప్రజలకు క్షమాపణలు..!