ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు: కొత్త రెవెన్యూ చట్టం బిల్లుపై సీఎం కేసీఆర్‌

  • Published By: madhu ,Published On : September 9, 2020 / 01:41 PM IST
ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు:  కొత్త రెవెన్యూ చట్టం బిల్లుపై సీఎం కేసీఆర్‌

Telangana new revenue act 2020: ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదు, ఇకపై  తహసీల్దారు ఇక జాయింట్ సబ్‌రిజిస్ట్రార్లుగా వ్యవహరిస్తారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రెవెన్యూ బిల్లును సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ చట్ట సవరణ దిశగా తెలంగాణ సర్కార్ కీలక అడుగులు వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమగ్ర సర్వే చేయిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.



అంతే కాదు రెవెన్యూ కోర్టులను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఐటీ అభివృద్ధి చెందినప్పటికీ.. భూ సంస్కరణల్లో మార్పులు తీసుకురాలేక పోయారని, కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో అధికారం ఉండడం వల్ల మాఫియాలు పుట్టుకొచ్చాయన్నారు. అవినీతితో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు,

ఎమ్మార్వోపై పెట్రోల్ పోసి తగులబెట్టే దుస్థితి ఏర్పడిందని సభలో వెల్లడించారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్‌లో పంచాయ‌తీ, పురపాలిక‌, న‌గ‌ర‌పాలిక‌, జీహెచ్ఎంసీ ఆస్తుల వివ‌రాలు ఉంటాయ‌న్నారు. ఎవ‌రు ఎక్క‌డున్నా ఉన్న చోట నుంచే ఆస్తుల వివ‌రాలు చూసుకోవ‌చ్చన్నారు.

రిజిస్ర్టేష‌న్ ప్ర‌క్రియ ముందే అలాట్ చేయాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన వివ‌రాలు వెబ్‌సైట్‌లో న‌మోదు చేయడం జరుగుతుందన్నారు. రిజిస్ర్టేష‌న్ కోసం ముందే ప్ర‌జ‌లు స్లాట్ అలాట్‌మెంట్ కోరాలన్నారు సీఎం కేసీఆర్.



ఉద్యోగులకు ఎలాంటి ఢోకా లేదని కేసిఆర్ హామీ ఇచ్చారు.  5485మంది వీఆర్వోలు ఉన్నారు. వారిని స్కేల్‌ ఉద్యోగులుగా పరిగణిస్తామని తెలిపారు. వీఆర్వోలను ఏదైనా సమానస్థాయి ఉద్యోగానికి బదిలీ చేస్తామన్నారు. ఒకవేళ సంబంధిత విభాగాలు నిరాకరిస్తే వీఆర్‌ఎస్‌ లేదా స్వచ్ఛంద పదవీ విరమణకు అవకాశం కల్పించేలా చట్టం తీసుకువస్తామని భరోసానిచ్చారు. కాకపోతే, రికార్డులను అక్రమంగా మార్పులు చేయడం, మోసపూరిత ఉత్తర్వులు చేయకూడదని, ఒకవేళ అక్రమాలకు పాల్పడితే సర్వీసు నుంచి తొలగింపు ఉంటుందని హెచ్చరించారు కేసీఆర్. సమగ్ర భూ సర్వే చేయించి, ఆ వివరాలతో ధరణి పోర్టల్ ఉంటుందని చెప్పారు.

ఇంకా ఏమన్నారంటే..
– చట్టంలో మార్పులు చేసే ముందు రెవెన్యూ ఉద్యోగులతో నేనే మాట్లాడా.
– చట్టంలో ఎలాంటి మార్పులు చేసినా అభ్యంతరం లేదని రెవెన్యూ ఉద్యోగులు చెప్పారు.
– మాకు ఉద్యోగ భద్రత ఉండేలా చూడాలని వారు కోరారు.
– ఉద్యోగుల భద్రతకు ఎలాంటి డోకా ఉండదు.
– వీఆర్‌ఏలకు గతంలో రూ.5,500 జీతం ఉండేది.
– వీఆర్‌ఏలకు మా ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.10వేలకు పెంచాం.
– వీఆర్‌ఏలను వారి స్థాయిని బట్టి స్కేల్ ఇచ్చి వివిధ శాఖల్లో నియమిస్తాం.
https://10tv.in/telangana-17-new-castes-in-bc-community/




– వారందికి ఉద్యోగ భద్రత ఉంటుంది.
– వారందిరిని వివిధ ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తాం.
– త్వరలో సమగ్ర వివరాలతో ధరణి పోర్టల్ వస్తుంది.
– ధరణి పోర్టల్ 2భాగాలుగా ఉంటుంది.




– అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ గా ధరణి ఉంటుంది.
– 2కోట్ల 75లక్షల ఎకరాలు తెలంగాణ రాష్ట్ర భూ భాగం.
– రాష్ట్రంలో కోటి 55లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి.
– 50నుంచి 60లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి.
– మిగిలినవి వ్యవసాయేతర భూములు ఉన్నాయి.




– ఇన్నాళ్లు భూమి అమ్మాలంటే ఈసీ తీసుకురమ్మని చెప్పేవాళ్లు.
– ఇకపై భూమి తాలుకా ఈసీ, ఇతర వివరాలన్నీ ధరణిలో ఉంటాయి.
– రిజిస్ట్రేషన్ చేయకూడని భూములను చేయాలని ప్రయత్నిస్తే అది లాక్‌ అవుతుంది.
– నా జీవితానికే ఆనందపడే విషయం.
– ఖర్చు ఎంతైనా పర్వాలేదు, భూ సమస్యల పీడ విరగడయ్యేందుకు సాహసిస్తున్నాం.




– తెలంగాణలో ఈ ప్రక్రియ పూర్తైన తరువాత ప్రతీ భూమిని కొలుస్తాం.
– ప్రతి సింగిల్ నంబర్ కోఆర్డినేట్ ద్వారా సర్వే చేయిస్తాం.
– – ఒకరి భూమిని.. మరొకరు అంగుళం భూమిని మరెవరూ ఆక్రమించుకోలేరు.
ప్రతీ ఎకరా భూమిని జియో ట్యాగ్ చేస్తాం.
– వీఆర్‌ఏలో ఎక్కువమంది దళితులు, బీసీలు ఉన్నారు.




– ప్రభుత్వం మీద 260కోట్ల అదనపు భారం పడినా వారికి స్కేల్ ఇస్తాం.
– తెలంగాణలో సంపూర్ణంగా భూ సర్వే – సీఎం కేసీఆర్.
– ఎమ్మార్వో, ఆర్డీవోల అధికారాలకు కోత విధిస్తున్నాం.
– తహసీల్దార్‌ వద్ద ఓ కోర్టు, ఆర్డీవో వద్ద ఓ కోర్టు, జాయింట్ కలెక్టర్ వద్ద కోర్టు – ఉంది.




– ఆర్డర్‌లు పాస్ చేసేది వారే.. జడ్జిల స్థానంలో ఉండేది వాళ్లే.
– రెవెన్యూ కోర్టులను రద్దు చేస్తాం.
– 100శాతం పారదర్శకంగా 99.9శాతం గొడవలు లేకుండా ఇకపై – ఎమ్మార్వోలందరూ జాయింట్ సబ్‌రిజిస్ట్రార్లు.