Shilpa Chowdary: శిల్పా చౌదరి నుంచి నిజం రాబట్టడానికి పోలీసులకు చివరి అవకాశం
కిట్టీ పార్టీల పేరుతో పలువురు సెలబ్రిటీల వద్ద కోట్ల రూపాయల లూటీ చేసిన కేసులో అరెస్టైన శిల్పా చౌదరి పోలీసు విచారణ నేటితో ముగియనుంది. కోర్టు అనుమతితో శిల్పా చౌదరిని మరోసారి....

Shilpa Chowdary
Shilpa Chowdary: కిట్టీ పార్టీల పేరుతో పలువురు సెలబ్రిటీల వద్ద కోట్ల రూపాయల లూటీ చేసిన కేసులో అరెస్టైన శిల్పా చౌదరి పోలీసు విచారణ నేటితో ముగియనుంది. కోర్టు అనుమతితో శిల్పా చౌదరిని మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు నార్సింగి పోలీసులు.
బిజినెస్, రియల్ ఎస్టేట్, చిట్టీల పేరుతో ధనవంతులను టార్గెట్ చేసి కోట్లు వసూలు చేసింది. డబ్బులు ఎగనామం పెట్టి మోసం చేయడానికి ప్రయత్నించింది. నార్సింగి పోలీసు స్టేషన్లో మూడు కేసులు నమోదు కావడంతో విచారణ మొదలైంది.
మొదటి సారి కోర్టు అనుమతితో కస్టడీలో రెండు రోజుల పాటు విచారణ, రెండోసారి కూడా కోర్టు అనుమతితో మూడు రోజుల పాటు విచారణ, మూడో సారి కోర్టు అనుమతితో ఒక రోజు విచారణ నిర్వహించనున్నారు.
………………………………: భారీగా తగ్గిన నెట్‌ఫ్లిక్స్ ఇండియా రేట్లు
మంగళవారం శిల్పాను ఒకరోజు పాటు పోలీసులు విచారించనున్నారు. ఇప్పటివరకూ శిల్పా చౌదరి నుంచి ఎటువంటి సమాధానాలను పోలీసులు రాబాటలేకపోతున్నారు. బాధితుల నుంచి కోట్లు వసూలు చేసిన శిల్పా చౌదరి ఏం చేసిందనే దానిపై పోలీసులు అరా తీస్తున్నారు.
చివరి రోజు పోలీసు కస్టడీ కావడంతో శిల్పా చౌదరి నుంచి పోలీసులు ఎలాంటి సమాధానాలు రాబడతారు అనే దానిపై ఆసక్తి నెలకొంది.