Telangana Police Recruitment
Chairman Srinivasa Rao : రాష్ట్రంలో పోలీసుల ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతోందని తెలంగాణ పోలీసు నియామక మండలి చైర్మన్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. అక్రమాల గురించి తెలిస్తే పోలీసు నియామక మండలి దృష్టికి తీసుకురావాలని సూచించారు. అక్రమాలపై పక్కా సమాచారం ఇచ్చిన వారికి రూ.3 లక్షల పారితోషికం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
పోలీసు ఉద్యోగాల కోసం మొత్తం 12.9లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. కొంతమంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారని వెల్లడించారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి అయిందని తెలిపారు. గత నెల జూన్ 14 నుంచి 26వ తేదీ 97 వేల మందికి పైగా అభ్యర్థుల సర్టిఫికేట్స్ పరిశీలన పూర్తి చేశామని పేర్కొన్నారు.
మూడు దశల్లో ఉద్యోగ నియమాక ప్రక్రియ చేపట్టామని వెల్లడించారు. తుది రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికేట్స్ పరిశీలన పూర్తి అయిందని తెలిపారు.వయసు, విద్యార్హత లేకున్నా కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేశారని..వాటిని తిరస్కరించినట్లు చెప్పారు.