Ts Covid Update
TS Covid Update : తెలంగాణలో నిన్నకొత్తగా 203 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 160 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 98.84 శాతంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ పేర్కొంది.
దీంతో, రాష్ట్రంలో ఇంతవరకు 6,77,341మందికి పైగా కొవిడ్ సోకగా, వారిలో 6,69,488 మంది పైగా కోలుకున్నారు. ఇలా ఉండగా, గడచినా 24 గంటల్లో మరొకరు మరణించటంతో, కోవిడ్, తదితర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 4,001 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,852 క్రియాశీల కేసులు ఉన్నాయి.
Also Read : Medipally SI In ACB Net : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మేడిపల్లి ఎస్సై యాదగిరి రాజు