Medipally SI In ACB Net : లంచం తీసుకుంటూ ఏసీబీ‌కి చిక్కిన మేడిపల్లి ఎస్సై యాదగిరి రాజు

రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని మేడ్చల్ జిల్లా మేడిప‌ల్లి  పోలీసు స్టేషన్  ఎస్ఐ యాద‌గిరి రాజు ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు.

Medipally SI In ACB Net : లంచం తీసుకుంటూ ఏసీబీ‌కి చిక్కిన మేడిపల్లి ఎస్సై యాదగిరి రాజు

Medipally Si Yadagiri Raju

Medipally SI In ACB Net :  రాచకొండ పోలీసు కమీషనరేట్ పరిధిలోని మేడ్చల్ జిల్లా మేడిప‌ల్లి  పోలీసు స్టేషన్  ఎస్ఐ యాద‌గిరి రాజు ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గత నెల 28న హెచ్.పి.పెట్రోల్‌బంక్ వద్ద జరిగిన బైక్ యాక్సిడెంట్ కేసులో లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు.

బోడుప్పల్ అంబేద్కర్ నగర్ కు చెందిన నల్లిక శ్రీనివాస్ అనే వ్యక్తి బైక్ పై వెళుతుండగా… మరో బైక్ పై వస్తున్న వ్యక్తి… శ్రీనివాస్ బైక్ ని ఢీ కొట్టి వెళ్లుపోయాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ కాలుకు ఫ్రాక్చర్ కావటంతో శ్రీనివాస్ కుమారుడు ప్రశాంత్ మేడిపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తులో శ్రీనివాస్ బైక్‌ను ఢీ కొట్టిన బైక్‌ను   గుర్తించారు. కేసుకు సంబంధించిన సర్టిఫికెట్స్ తయాలు చేయటానికి రూ.20 వేలు అవుతుందని ఎస్సై యాదగిరిరాజు ప్రశాంత్‌ను   లంచం డిమాండ్ చేశాడు. చివరికి ఇద్దరికి రూ. 10 వేల దగ్గర రాజీ కుదిరింది. ఎస్సై యాదగిరికి రూ.10 వేలు ఇచ్చేముందు ప్రశాంత్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు.
Also Read : Dead Body In Water Tank : హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకులో డెడ్ బాడీ… నీళ్లు తాగిన ప్రజల్లో ఆందోళన
ఏసీబీ అధికారులు ఇచ్చిన పక్కా ప్రణాళికతో   ప్రశాంత్ నిన్న యాదగిరికి   డబ్బులు ఇస్తూ ….. ఏసీబీ అధికారులుకు రెడ్ హ్యాండెడ్ గా పట్టించాడు. యాదగిరిపై కేసు న‌మోదు చేసుకున్న ఏసీబీ అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప్ర‌భుత్వ అధికారులు ఎవ‌రైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబ‌ర్ 1064కు కాల్ చేయాల‌ని ఏసీబీ అధికారులు సూచించారు.